యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ బీపీ, డయాబెటిస్ బాధితులకు దివ్యౌషధం - ఈ జాగ్రత్తలతో..!!

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. యాపిల్ పండ్ల‌ను పులియబెట్టి యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను త‌యారు చేస్తారు. ఇది అనేక పోష‌కాల‌ను, ఔష‌ధ విలువ‌ల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగ‌ర్‌లో అసిటిక్ యాసిడ్ ప్ర‌ధాన స‌మ్మేళ‌నంగా ఉంటుంది. ఇది మ‌న‌కు ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను క‌ల‌గ‌జేస్తుంది. బీపీ, డియాబెటిక్ నియంత్రణలోనూ మేలు చేస్తుంది. అయితే, వినియోగంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ షుగ‌ర్ ఉన్న‌వారికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తీసుకుంటే శ‌రీరం ఇన్సులిన్‌ను మ‌రింత మెరుగ్గా ఉప‌యోగించుకుంటుంది. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. అధికంగా బ‌రువు ఉన్న‌వారు కూడా దీన్ని తీసుకుంటే మేలు జ‌రుగుతుంది. శ‌రీరంలోని కొవ్వు క‌రిగేలా చేస్తుంది. క‌నుక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారు రోజూ దీన్ని తాగుతుంటే ఉప‌యోగం ఉంటుంది. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌లో యాంటీ మైక్రోబియ‌ల్, యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరంలో ఉండే బ్యాక్టీరియా, వైర‌స్‌ల‌ను నాశ‌నం చేస్తాయి. దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. రోగాలు రాకుండా ఉంటాయి.

is-apple-cider-vinegar-good-for-high-blood-pressure-and-diabetes

ఇక, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ అంటే పులిసిన ఆహారం. క‌నుక ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌కు మేలు చేస్తుంది. ఇది ప్రో బ‌యోటిక్ ఆహారంగా ప‌నిచేస్తుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌లో ఉండే మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. దీని వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.
యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ లో ఆమ్ల‌త్వం అధికంగా ఉంటుంది. క‌నుక దీన్ని నేరుగా తాగ‌కూడ‌దు. నీటితో క‌లిపి తాగాల్సి ఉంటుంది. దంతాల‌కు ఇది త‌గ‌ల‌కుండా తాగాల్సి ఉంటుంది. లేదంటే దంతాల‌పై ఉండే ఎనామిల్ పొర దెబ్బ తినే అవ‌కాశాలు ఉంటాయి. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను నేరుగా తాగితే ఆహార నాళంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంది. దీంతో జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక క‌చ్చితంగా నీటితో క‌లిపి తీసుకోవాల్సి ఉంటుంది. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను రోజుకు 15 నుంచి 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవ‌చ్చు. ఉద‌యం అల్పాహారానికి 30 నిమిషాల ముందు తాగాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ రోజంతా నియంత్ర‌ణ‌లో ఉంటాయి. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను నెమ్మ‌దిగా తాగాలి. ఒకేసారి తాగేయ‌కూడ‌దు. ఇలా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను తీసుకుంటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+