కల్లు తాగితే ఆరోగ్యానికి మంచిదా కాదా? తెలుసుకోండి!
చాలా మంది కల్లు ఇష్టంగా తాగుతారు. అయితే కల్లు తాగటం మంచిదని కొందరు, మంచిది కాదని మరికొందరు వాదిస్తారు. అయితే కల్లు తాగటం మంచిదేనా? దీనివలన మన ఆరోగ్యంలో వచ్చే మార్పులు ఏమిటి? అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. కల్లు ఆరోగ్యానికి మంచిదే.. కానీ అది మితంగా తీసుకున్నప్పుడే అది మంచి ప్రయోజనాలను ఇస్తుంది.
కల్లులో ప్రీ రాడికల్స్ నిరోధించే శక్తి
కల్లులో యాంటీ ఆక్సిడెంట్ లు ఉన్నాయి. ఇవి మనలను ప్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. కల్లులోఉండే పోషకాలు మన ఆరోగ్య రక్షణకు దోహదం చేస్తాయి. క్యాన్సర్, గుండె జబ్బులకు కారణమయ్యే ప్రీ రాడికల్స్ ను నిరోధిస్తాయి. ఈతకల్లులో విటమిన్ సి, విటమిన్ బి1, రిబోఫ్లావిన్ ఉన్నాయి. కల్లులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

కల్లులో మన శరీరానికి కావాల్సిన అద్భుత పోషకాలు
కల్లు విటమిన్ B, విటమిన్ C, పొటాషియం, ఐరన్, జింక్, మాగ్నీషియం వంటి విభిన్న పోషకాలతో నిండి ఉంటుంది. తాటి కల్లు ఎలక్ట్రోలైట్‌లను సమృద్ధిగా కలిగి ఉండటంతో, ఇది శరీరంలో న్యూట్రియంట్‌లను సంతులనం చేయడంలో సహాయపడుతుంది. కల్లులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కల్లులో ఎసిటిక్ యాసిడ్ బ్యాక్టీరియా మరియు లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా ఉంటాయి. ఇది మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
కల్లు పాలిచ్చే తల్లులకు పాల ఉత్పత్తి పెంచే పానీయం
ఈతకల్లు పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని మెరుగు పరచటానికి దోహదం చేస్తుంది. తల్లి పాలు శిశువులకు ఉత్తమ ఆహారం, ఇది పోషకాలను మరియు రోగనిరోధక శక్తిని అందిస్తుంది. ఈతకల్లు ప్రొలాక్టిన్ మరియు ఆక్సిటోసిన్ హార్మోన్లను ప్రేరేపించడం ద్వారా తల్లుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాదు పాల నాణ్యత కూడా పెరుగుతుంది.
కల్లుతో ఒత్తిడికి చెక్
కల్లు మనలోని ఒత్తిడి స్థాయిలను తగ్గించటంలో కీలకంగా పని చేస్తాయి. కల్లులో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటు మరియు నరాల సంకేతాలను నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. పొటాషియం మీ రక్త నాళాలు మరియు నరాలనకు సంబంధించి సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది.
కల్లులో కంటి ఆరోగ్యం
కల్లులో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలు ఉన్నాయి. కల్లులో విటమిన్ బీ, సి ఉంటాయి. ఇవి కాటరాక్ట్ వంటి కంటి సంబంధ సమస్యలు రాకుండా చేస్తాయి.దీంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కల్లులో విటమిన్ బీ, విటమిన్ ఈ తో పాటు ఐరన్ ఉంటాయి. కల్లుతో చర్మ ఆరోగ్యాన్ని, గోర్ల ఆరోగ్యం, జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆయితే అతిగా కల్లు సేవించటం ఆరోగ్యానికి హానికరం.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!!












Click it and Unblock the Notifications