Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మన శరీరంలో అత్యంత మురికిగా ఉండే భాగమిదే.. ఈ శరీరభాగాలలోనూ శుభ్రత అవసరం

ప్రతిరోజు మనం శుభ్రంగా స్నానం చేస్తాం. అయితే మనం స్నానం చేయడం వల్ల మన శరీరంలోని అన్ని భాగాలు శుభ్రంగా మారాయని ఫీలవుతాం. ఫ్రెష్ గా ఉన్నామని సంబరం పడిపోతాం.. కానీ మనం ఎంత శుభ్రంగా స్నానం చేసిన, శరీరంలోని కొన్ని భాగాల మీద పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తాం. దీంతో అక్కడ మురికి చేరుకుని వేల బ్యాక్టీరియాలకు కారణమవుతుంది.

నాభి అత్యంత మురికి ప్రదేశం
స్నానం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మరిచిపోయే ఆ శరీర భాగాలు ఏమిటి? మన శరీరంలో ఏ భాగం అత్యంత మురికిగా ఉంటుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది శరీరంలోని నాభి భాగాన్ని స్నానం చేసేటప్పుడు శుభ్రం చేసుకోరు. మన శరీరంలోని అత్యంత మురికిగా ఉండే ప్రదేశం నాభి అని చెబుతున్నారు దీనిపైన అధ్యయనం చేసిన వారు. మన బొడ్డులో బ్యాక్టీరియా కుప్పలు తెప్పలుగా నివసిస్తాయి అని చెబుతున్నారు.

It is the most dirtiest part of our body Cleanliness is required in these body parts too

బొడ్డులో వేల బ్యాక్టీరియాలు
ఒక అధ్యయనం ప్రకారం మన బొడ్డు 2368 బ్యాక్టీరియాలకు నిలయంగా గుర్తించినట్టు చెబుతున్నారు. ఇక ఈ బ్యాక్టీరియాలో 1458 కొత్త జాతులు ఉన్నాయని కూడా చెబుతున్నారు. సహజంగా నాభి భాగం లోతుగా ఉండటం వల్ల దీనిని బాగా శుభ్రం చేయలేరని ఫలితంగా నాభి భాగంలో మురికి పేరుకుపోతుందని చెబుతున్నారు.

నాభి తర్వాత మురికిగా ఉండే శరీర భాగాలివే
ఇక నాభి తరువాత బాగా మురికిగా ఉండే శరీర భాగాలు కూడా ఉన్నాయి. మానవ శరీరంలో నోరు ఎక్కువ బ్యాక్టీరియా ఉండే శరీర భాగం . మన నోరు 600 కంటే ఎక్కువ రకాల బ్యాక్టీరియాలకు స్థానంగా ఉంటుంది. ఇక నోటి తర్వాత చంకలు ఎక్కువగా మురికిగా ఉండే శరీర భాగాలని చెప్తారు. స్నానం చేసేటప్పుడు చాలామంది చంకలపైన శ్రద్ధ పెట్టాలని, చంకలు శుభ్రంగా ఉంచుకోవడం అవసరమని చెప్తున్నారు.

స్నానం చేసేటప్పుడు వీటిని కూడా శుభ్రం చేసుకోవాలి
లేదంటే అక్కడ కూడా విపరీతంగా బ్యాక్టీరియా పెరుగుతుందని చెబుతున్నారు. మన ముక్కు లోపలి భాగం కూడా బ్యాక్టీరియాకు నిలయమని, ఇది మన శరీరంలోని మరొక ముఖ్యమైన మురికి ప్రదేశమని చెబుతున్నారు. ఇక గోళ్ళు కూడా బ్యాక్టీరియాకు నిలయాలని, గోళ్ళు, పాదాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.
.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+