JN1పై వైఎస్ జగన్ హెచ్చరిక
కొవిడ్ పై కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరికలు రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. కొవిడ్ తోపాటు ఇతర అంశాలపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు సమీక్ష నిర్వహించారు. ర్యాపిడ్ కిట్లతోపాటు ఆక్సిజన్ కిట్లు, బెడ్లు, మందులు తదితర అంశాలను సమీక్షించారు. కొవిడ్ జేఎస్ 1 వేరియంట్ పై జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖ రాసింది. కేరళలో కేసులు పెరిగాయని, కొత్త వేరియంట్ ప్రభావం కనిపిస్తోందని, నియంత్రణ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
రాబోయే రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగలు ఉండటంతో వైరస్ విస్తరించకుండా నియంత్రణకు మార్గదర్శకాలు అమలు చేస్తున్నారు. జిల్లాల వారీగా ఆసుపత్రులకు వచ్చే రోగులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసి కేసుల పెరుగుదలను తొలి దశలోనే గుర్తించగలిగితే వైరస్ ను వ్యాప్తిచెందకుండా చేయొచ్చని భావిస్తున్నారు.

జేఎన్.1 వేరియంట్ సోకిన వారిలో రోగ లక్షణాలు ఎలా ఉంటాయనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. సాధారణ కొవిడ్-19 సోకినప్పుడు కనిపించే లక్షణాలే కనిపిస్తాయని భావిస్తున్నారు. ఈ వేరియంట్ సోకినప్పుడు ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతం కూడా ఏమీలేదు. ప్రజారోగ్యానికి ముప్పు పెరుగుతుందన్న ఆందోళన అవసరంలేదని, ఇప్పుడున్న లేబొరేటరీల్లో ఆర్‌టీపీసీఆర్ టెస్టుల ద్వారా జేఎన్.1 వేరియంట్‌ను కనిపెట్టవచ్చంటున్నారు. ప్రజల్లో అప్రమత్తత అవసరమని కేంద్రం సూచిస్తోంది.












Click it and Unblock the Notifications