వీటితో కిడ్నీలు క్లీన్ గా, ఆరోగ్యంగా

మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కొన్ని ఆహారాలు కిడ్నీల పనితీరును మెరుగుపరచడానికి, టాక్సిన్స్ తొలగించడానికి అవసరమవుతాయి. కొన్ని రకాల పానీయాలు కూడా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తాయి. మరి మూత్రపిండాల ఆరోగ్యం కోసం దోహదం చేసే డిటాక్స్ ఫుడ్స్ మరియు డ్రింక్స్ గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

కిడ్నీల ఆరోగ్యానికి కీరా దోస
ఆరోగ్యాన్ని కాపాడడంలో కీరదోస బాగా పనిచేస్తుంది. కీరదోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తూ వాటిని శుభ్రపరుస్తుంది. కీర దోసకాయలో ఉండే పోషకాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా కీర దోసకాయ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Keep your kidneys clean and healthy with these foods and drinks

కిడ్నీల ఆరోగ్యానికి సిట్రస్ పండ్లు
సిట్రస్ పండ్లు కూడా కిడ్నీల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు శరీరానికి హైడ్రేషన్ ను అందిస్తాయి. శరీరంలో నుండి విష పదార్థాలను బయటకు పంపడానికి దోహదం చేస్తాయి. ఇవి మూత్రపిండాలలో రాళ్లు రాకుండా చేస్తాయి. నిత్యం ఈ పండ్లను తీసుకోవడం వల్ల మూత్రంలో సిట్రిక్ స్థాయిలను మెరుగుపరిచి, కిడ్నీల సామర్థ్యం పెరుగుతుంది.

వీటితో కిడ్నీల ఆరోగ్యం
సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు చేపలు కూడా కిడ్నీల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇవి కిడ్నీల పనితీరును మెరుగుపరిచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలో కొవ్వు స్థాయిలను తగ్గించి రక్తపోటును నియంత్రిస్తాయి. ఫలితంగా సహజంగానే మూత్రపిండాలకు ఇవి రక్షణ కవచంలా నిలుస్తాయి.

ఇవి తాగితే కిడ్నీలలో టాక్సిన్స్ బయటకు
ఇక కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీలలో విషపదార్థాలు తొలగిపోవాలంటే తగినంత నీటిని తీసుకోవడం ఎంతో అవసరం. ప్రతిరోజు నీటిని తగినంత తీసుకోవడం వల్ల మూత్రపిండాలు శుభ్రపడతాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో నీళ్లు కీలక భూమిక పోషిస్తాయి. కనక కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు కచ్చితంగా ఈ ఆహారాలు, పానీయాలను తీసుకుంటే మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+