తెలంగాణా సర్వపిండి.. ఇలా చేస్తే క్రిస్పీగా, సూపర్ గా!
సర్వ పిండి.. తెలంగాణకు ప్రత్యేకమైన క్రిస్పీ, రుచికరమైన స్నాక్. దీనిని ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు. బియ్యం పిండితో చేసే ఈ స్నాక్ ను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
కావాల్సిన పదార్థాలు
బియ్యపు పిండి - 2 కప్పులు
పల్లీల పప్పు (రోస్టెడ్ ) - ¼ కప్పు
నువ్వులు - 3 టేబుల్ స్పూన్లు
కారం (మిరపకాయ పొడి) - 1½ నుంచి 2 టీస్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగ్గట్టు
నూనె - 2-3 టేబుల్ స్పూన్లు (కలపడానికి) + వేయించడానికి
నీళ్లు - కావాల్సినంత
కరివేపాకు - కొన్ని ఆకులు
వాము - ½ టీస్పూన్ (ఆప్షనల్)

తయారీ విధానం
బియ్యపు పిండి, పల్లీలు, నువ్వులు, జీలకర్ర, కారం, ఉప్పు, వాము, కరివేపాకు ఒక గిన్నెలో కలపండి. 2-3 టేబుల్ స్పూన్ల నూనె పోసి చేతితో బాగా రుద్ది కలపండి నూనె బాగా కలిసిపోయేలా కలపాలి. కాస్త కాస్త నీళ్లు పోస్తూ మెత్తగా, మృదువైన పిండి తయారు చేసుకోండి. చాలా గట్టిగా ఉండకూడదు, చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా ఉండాలి.
ఇలా చేస్తే సర్వపిండి సూపర్
పిండిని నిమ్మకాయ సైజు ఉండలుగా చేసుకోండి. ఆపై ప్లాస్టిక్ షీట్ లేదా ఆయిల్ రాసిన ప్లేట్ మీద ఉంచి చేతితో సన్నగా, గుండ్రంగా ఒత్తుకోవాలి. సర్వ పిండి ¼ ఇంచ్ మందం ఉండాలి.
మధ్యలో చిన్న రంధ్రం చేస్తే అంతా బాగా కాలుతుంది. స్టవ్ పైన మూకుడు పెట్టి అందులో నూనె మీడియం ఫ్లేమ్‌లో వేడి చేసుకోండి. ఆపై ఒత్తుకున్న సర్వ పిండి అందులో పెట్టి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు క్రిస్పీగా వేయించండి. కాగితం మీద తీసి అదనపు నూనె పీల్చుకోనివ్వండి.
తెలంగాణా స్టైల్ లో ఇలా చేస్తే బెస్ట్
పిండి ఎంత సమానంగా, సన్నగా వత్తితే అంత క్రిస్పీగా సర్వపిండి వస్తుంది. నూనె ఎక్కువ వేడిగా ఉంటే లోపల మెత్తగా ఉండి బయటే కాలిపోతాయి. మీడియం హీట్‌లో వేయించండి. వేడిగా గానీ,చల్లారిన తర్వాత గానీ కారం ఎక్కువైతే తెలంగాణా స్టైల్‌లో మరింత రుచిగా ఉంటుంది. టీ లేదా కాఫీతో స్నాక్స్ లా బాగుంటాయి. సాంప్రదాయ తెలంగాణా రుచి కావాలంటే ఈ విధంగా చేయండి.













Click it and Unblock the Notifications