పొద్దుతిరుగుడు గింజల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు!
మనకు ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే వాటిల్లో పొద్దుతిరుగుడు గింజలకు ఒక మంచి స్థానం ఉంది. పొద్దు తిరుగుడు గింజల్లో క్యాలరీలు, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వు, పిండి పదార్థాలు, ఫైబర్ ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. శరీరంలో ప్రీ రాడికల్స్ వల్ల వచ్చే నష్టాలనుండి మన శరీరాన్ని కాపాడుతుంది.
పొద్దు తిరుగుడు గింజలతో గుండె ఆరోగ్యం
పొద్దుతిరుగుడు విత్తనాలలో బి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. పొద్దుతిరుగుడు విత్తనాలలో థయామిన్, రిబోఫ్లావీన్, నియాసిన్ ఉంటాయి. ఇవి మన శరీరాన్ని అనేక విధాలుగా రక్షిస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు ముఖ్యంగా మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తనాళాలలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పొద్దుతిరుగుడు గింజలు కీలక భూమిక పోషిస్తాయి.

పొద్దు తిరుగుడు గింజలతో యవ్వనంగా
పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉండడం వల్ల ఇది మన శరీరంలో కోల్పోతున్న కొలాజిన్ ఉత్పత్తికి దోహదం చేసి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పొద్దుతిరుగుడు గింజలను నిత్యం తీసుకుంటే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే ప్రోటీన్, ఫైబర్ కారణంగా మన కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది మనను అతిగా తినడం నుండి నివారిస్తుంది. ఫలితంగా మనం ఆరోగ్యకరంగా బరువు తగ్గే అవకాశం కలుగుతుంది.
పొద్దు తిరుగుడు గింజలతో ఎముకల ధృడత్వం
పొద్దుతిరుగుడు గింజలలో ఉండే విటమిన్ ఈ తోపాటు, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా మన కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మనల్ని ఒత్తిడి నుంచి కాపాడుతుంది. పొద్దుతిరుగుడు గింజల్లో మెగ్నీషియం, కాల్షియం, మరియు కాపర్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది ఎముకల బలాన్ని పెంచుతుంది. ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది.
జీర్ణ వ్యవస్థకు, డయాబెటిస్ కంట్రోల్ కు బెస్ట్ ఫుడ్
పొద్దు తిరుగుడు గింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ కారణంగా మన మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇది మన బ్రెయిన్ ఫంక్షన్ కు ఎంతగానో దోహదం చేస్తుంది. పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే డైటరీ ఫైబర్ కారణంగా మన జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మన జీర్ణ వ్యవస్థకు ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
పొద్దు తిరుగుడు గింజలతో ఈ సమస్యలకు చెక్
పొద్దుతిరుగుడు గింజలలో ఉండే పోషకాలు పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇక మహిళలలో కూడా మూడ్ స్వింగ్స్, రుతుక్రమ సమస్యలను తగ్గించడంలో దోహదం చేస్తాయి. పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ మనల్ని క్యాన్సర్ నుండి కాపాడతాయి. మన జుట్టు ఆరోగ్యాన్ని కూడా పొద్దు తిరుగుడు గింజలు మెరుగుపరుస్తాయి. అయితే పొద్దుతిరుగుడు గింజలను ఎక్కువ మోతాదులో తినడం మంచిది కాదు. దీనివల్ల అనేక ఇబ్బందులు రావచ్చు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications