నిమ్మరసంతో ఎన్నో ప్రయోజనాలు...వీరికి మాత్రం డేంజర్..!!
నిమ్మకాయ. ప్రతీ ఇంటా వినియోగిస్తారు. ఆయుర్వేద ప్రకారం నిమ్మ మనకు అనేక లాభాలను అందిస్తుంది. నిమ్మరసంలో అనేక పోషకాలు ఉంటాయి. ఆరోగ్ పరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. నిమ్మరసాన్ని తాగే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. అనేక మంది ఉదయం వేళ వేడి నీళ్లతో నిమ్మ రసం తీసుకుంటారు. అయితే, కొందరికి మాత్రం నిమ్మ రసం నిత్యం తీసుకోవటం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిమ్మరసం శరీరంలో అనేక రకాల జీవక్రియలకు మేలు చేస్తుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తులు నిమ్మరసాన్ని తాగవచ్చు. అయితే, అసిడిటీ, అల్సర్, కడుపు నొప్పి, పొట్టలో అసౌకర్యం ఉన్నవారు నిమ్మరసాన్ని పరగడుపున తాగకూడదు. జీర్ణాశయ సంబంధిత మెడిసిన్లను వాడేవారు కూడా నిమ్మరసాన్ని పరగడుపున సేవించకూడదు. అయితే నిమ్మరసం దంతాల ఎనామిల్‌పై ప్రభావం చూపిస్తుంది. కనుక దీన్ని నేరుగా తాగకూడదు. కచ్చితంగా నీటిలో కలిపి సేవించాల్సి ఉంటుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు 30 నిమిషాల ముందు తాగటం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీని ద్వారా జీర్ణ య మెరుగు పడుతుంది.

రోజంతా బయట తిరిగేవారు లేదా పనిచేసేవారు ఉదయం నిమ్మరసాన్ని సేవిస్తుంటే శరీరంలోని నీరు బయటకు వెళ్లకుండా ఉంటుంది. ఎలక్ట్రోలైట్స్ సమస్థితిలో ఉంటాయి. దీని వల్ల శరీరంలో వేడి చేరదు. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. నిమ్మరసంలో విటమిన్ సి ఉండటంతో ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల శరీరం ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. చర్మ కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. నిమ్మరసాన్ని రోజూ సేవిస్తుంటే జీర్ణశక్తి పెరిగి మెటబాలిజం మెరుగు పడుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఇలా నిమ్మరసాన్ని సేవించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.












Click it and Unblock the Notifications