ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడం కోసం ఆహారాల జాబితా.. ఎన్టీఆర్ ట్రస్ట్ పోస్ట్ వైరల్!
ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. సమాజానికి ఉపయోగపడే, సమాజంలోని వారికి అవసరమైన పలు సేవా కార్యక్రమాలతో ఎంతో కాలంగా ఈ ట్రస్ట్ తన సేవలను అందిస్తుంది. ఆరోగ్యం పైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఈ ట్రస్ట్ తాజాగా పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆహారాల లిస్టు
ఆరోగ్యం పైన అవగాహన కల్పించడం కోసం ఏ ఏ ఆహార పదార్థాలు తింటే ఏ ఏ అనారోగ్య సమస్యలు తగ్గుతాయో చెబుతూ లిస్టును షేర్ చేసింది. విద్యా , వైద్యం , మహిళా సాధికారత, విపత్తు సహాయం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ నిరుపేద విద్యార్థులకు ఉచిత శిక్షణతో పాటు, మెరిట్ స్కాలర్షిప్లను కూడా అందిస్తుంది.

ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడం కోసం ఆహారాల జాబితా
ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజలకు ఆరోగ్యం పైన అవగాహన కల్పిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడం కోసం ఏ ఏ ఆహారాలు తినాలో చెబుతూ ఒక జాబితాను విడుదల చేసింది. ఇక ఆ జాబితా వివరాల్లోకి వెళితే..
ఈ సమస్యలకు ఆ ఆహారాలతో చెక్
జ్వరం వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళను తాగితే దాని నుండి ఉపశమనం కలుగుతుంది. దగ్గు వస్తున్నప్పుడు పైనాపిల్ తింటే మంచిది. వికారంగా ఉంటే అల్లం, మొటిమలు బాగా ఎక్కువగా ఉంటే బాదం, మైకంగా ఉంటే పుచ్చకాయ, రక్తహీనతతో ఉన్నప్పుడు పాలకూర, బలహీనతకు ఖర్జూరం, నిద్రలేమి సమస్యలకు కివి పండ్లు మంచిది.
ఈ ఆహారాలతో మీకు బెనిఫిట్స్
ఇక కీళ్ల నొప్పులకు వాల్నట్స్ తింటే మంచిది. పొడి చర్మానికి అవకాడో, నోటి దుర్వాసన తగ్గేందుకు ఆపిల్, కడుపునొప్పి తగ్గేందుకు బొప్పాయి, కండరాల వాపులు తగ్గేందుకు పసుపు, కంటి బలహీనత తగ్గేందుకు క్యారెట్, సైనస్ ఇన్ఫెక్షన్ కు వెల్లుల్లి తింటే మంచిది.
ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల లిస్టు వైరల్
అరుగుదలకు మిరియాల టీ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి పుట్టగొడుగులు, గుండెల్లో మంట కొలెస్ట్రాల్ తగ్గడానికి ఓట్స్, కొవ్వు కాలేయానికి దుంపలు తింటే మంచిది. ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ పోస్ట్ చేసిన ఈ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.












Click it and Unblock the Notifications