మార్నింగ్ వాకింగ్ వర్సెస్ ఈవెనింగ్ వాకింగ్.. బరువు తగ్గాలంటే ఏది బెస్ట్?
వాకింగ్ చేయడం ఒక మంచి అలవాటు. వాకింగ్ చేస్తే మన ఆరోగ్యం మెరుగు పడుతుందని చాలామంది చెబుతారు. వాకింగ్ చేసేవాళ్ళు మార్నింగ్ వాకింగ్ చేస్తే మంచిదా? లేదా ఈవినింగ్ వాకింగ్ చేస్తే మంచిదా? అనేది తెలుసుకోవాలని కోరుకుంటారు. ఏ సమయంలో వాకింగ్ చేస్తే బరువు తగ్గడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని ఆలోచిస్తారు. ఇక అటువంటి వారికోసమే మార్నింగ్ మరియు ఈవినింగ్ వాకింగ్ ల ప్రయోజనాలను తెలిపే ఈ ఈ కథనం.
ఉదయం, సాయంత్రం ఎప్పుడు వాకింగ్ చేస్తే మంచిది?
ఉదయం పూట వాకింగ్ చేయడం లేదా సాయంత్రం వాకింగ్ చేయడం రెండిటికీ చాలా ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. మన శారీరక బరువు తగ్గాలంటే ఏ సమయంలో వాకింగ్ చేయాలో తెలుసుకోవాలి. అయితే వాకింగ్ చేస్తే బరువు తగ్గడం అనేది వ్యక్తిగత లక్ష్యాలు మరియు వారు వాకింగ్ చేయడానికి పెట్టుకున్న షెడ్యూల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదయం వాకింగ్ చేసినా, సాయంత్రం వాకింగ్ చేసినా మంచి ప్రయోజనాలు ఉంటాయి.

ఉదయం వాకింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలు ఇవే
ఈ రెండు సమయాల్లో వాకింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుంటే ఏ సమయంలో వాకింగ్ మీకు మేలు చేకూరుస్తుంది అనేది మీకే అర్థమవుతుంది. ఉదయం వాకింగ్ మన శరీర మెటబాలిజంను పెంచుతుంది. ఉదయం నడిస్తే రోజంతా క్యాలరీలను బర్న్ చేయడానికి ఇది సహాయపడుతుంది. బరువు తగ్గించుకోవాలని భావించే వారికి మార్నింగ్ వాకింగ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
సాయంత్రం వాకింగ్ చేస్తే ఈ ఫలితాలు
అదనంగా ఉదయం నడక మనకు మంచి ఆహ్లాదకరమైన మనసును ఇస్తుంది. ఉదయం సూర్యకాంతిలో నడవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ డి లభించడంతోపాటు, మనం యాక్టివ్ గా ఉండడానికి దోహదం చేస్తుంది. ఇక సాయంత్రం వేళ వాకింగ్ మనం విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. రోజంతా పనిచేసిన తర్వాత చేసే వాకింగ్ ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి దోహదం చేస్తుంది.
ఉదయం, సాయంత్రం వాకింగ్ వ్యక్తిగతం
సాయంత్రం చేసే వాకింగ్ తో తక్షణ బరువు తగ్గుదల నేరుగా లేకపోయినా, సాయంత్రం నడక మన నిద్ర నాణ్యతను పెంచుతుంది. మెరుగైన నిద్ర ఆకలి హార్మోన్లను నియంత్రించే బరువు నిర్వహణకు పరోక్షంగా దోహదం చేస్తుంది. ఉదయం మరియు సాయంత్రం వాకింగ్ చేయడం ఎవరికి వారికి వ్యక్తిగత వెసులుబాటును బట్టి ఉంటుంది.
ఇలా చేస్తే వాకింగ్ తో బరువుకు చెక్
మీకు ఉదయాన్నే ఎక్కువ శక్తి ఉంటే ఉదయం నడక మీకు అనుకూలంగా ఉంటుంది. వీలుకాకుంటే సాయంత్రం నడక కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఉదయం నడిచిన సాయంత్రం నడిచిన క్రమబద్ధంగా ఆహారం తీసుకోవడం, సమయానుకూలంగా వాకింగ్ చేయడం, ప్రతిరోజు ఒకే పద్ధతిని ఫాలో అవడం బరువు తగ్గడానికి మద్దతుని ఇస్తుంది.












Click it and Unblock the Notifications