సూపర్ టేస్ట్ తో అద్దిరిపోయే 'మటన్​ పాయా'.. వింటర్ లో తింటే దిల్ ఖుష్..!

నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారుండరు. అయితే నాన్​ వెజ్​ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే వంటకాల్లో మటన్ ముందు వరుసలో ఉంటుంది. మటన్ ముక్కలతో బిర్యానీ, కర్రీ తయారు చేసుకోవచ్చు. మటన్ లోని ప్రతి భాగంతో ఏదో ఒక స్పెషల్ వంటకం తయారు చేసుకోవచ్చు. మటన్ ముక్కలతోనే కాదు కాళ్లతోనూ అద్భుతమైన రెసిపీని చేసుకోవచ్చు. అదే మటన్ పాయా.. సూపర్ టేస్టీ మటన్ పాయా చేయడం అందరికీ కుదరదు. అయితే ఓసారి ఈ పద్దతిలో ట్రై చేయండి.. మీరు వావ్ అని లొట్టలేసుకుంటూ తింటారు. అంత అద్భుతంగా ఉంటుంది. మరి ఈ సూపర్ టేస్ట్ తో అద్దిరిపోయే 'మటన్​ పాయా' ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

'మటన్​ పాయా' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. మటన్ పాయా(కాళ్లు) నాలుగు ముక్కలు, ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగినవి, టమాటాలు రెండు సన్నగా తరిగినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి మూడు చీలికలు, పసుపు అర టేబుల్ స్పూన్, కారంపొడి ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి అర టేబుల్ స్పూన్, నెయ్యి లేదా నూనె రెండు టేబుల్ స్పూన్ లు, బిర్యానీ ఆకులు రెండు, దాల్చిన చెక్క ఒక అంగుళం, లవంగాలు నాలుగు, యాలకులు మూడు, మిరియాల పొడి అర టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నీరు తగినన్ని, కొత్తిమీర తగినంత గార్నిష్ కోసం, నిమ్మరసం కొద్దిగా తీసుకోవాలి.

ఇప్పుడు 'మటన్​ పాయా' తయారీ విధానం చూస్తే.. ముందుగా పాయా ముక్కలను శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు వేసిన నీటిలో 20 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత మళ్లీ కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లేదా గిన్నెలో తగినంత నెయ్యి లేదా నూనె వేడి చేసి అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి స్వల్పంగా వేగనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయేంత వరకూ కలుపుకోవాలి.

MuttonPaya Recipe Prepare This Amazing Dish with Simple Ingredients for Incredible Taste MuttonPaya

ఆ తర్వాత టమాటా ముక్కలు వేయాలి. మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులోనే పాయా ముక్కలను వేసి బాగా కలిపి 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి, గరం మసాలా వేసి మరలా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి దింపుకుంటే సరి.. సూపర్ టేస్ట్ తో అద్దిరిపోయే 'మటన్​ పాయా' రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+