Schools closed news: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరోసారి వేసవి సెలవులు పొడిగింపు..

విద్యార్థులకు వేసవి సెలవులు దాదాపు పూర్తయ్యాయి. తెలంగాణలో జూన్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఏపీలో జూన్ 12 నుంచే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 44 వేల ప్రైవేటు పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో సందడి నెలకొంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పాఠశాలలు ప్రారంభం కాలేదు. అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వేసవి సెలవులను పొడిగిస్తున్నాయి.

ఆ వివరాలు ఓ సారి చూస్తే.. ఉత్తర్ ప్రదేశ్ లో పాఠశాలలు జూన్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక దేశ రాజధాని దిల్లీలో జూలై 1 నుంచి విద్యాసంస్థలు ఓపెన్ కానున్నాయి. అలాగే హరియాణా, పంజాబ్ లో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇక మధ్య ప్రదేశ్ లో మే 1 నుంచి జూన్ 15 వరకు వేసవి సెలవులు ఇచ్చారు. పాఠశాలలు తిరిగి జూన్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఛత్తీస్ ఘడ్ లోనూ జూన్ 16 నుంచే పాఠశాలలు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.

Schools in Telangana to Reopen on June 15 Summer Holidays Extended Many Other States Schools Reopen

మరోవైపు బిహార్ లో మాత్రం జూన్ 21 న పాఠశాలలు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇక రాజస్థాన్ లో కూడా జూన్ 21 వ తేదీన పాఠశాలలు ప్రారంభం కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఇంకా పాఠశాలలు ప్రారంభం కాలేదు. ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లు సమాచారం. వివిధ రాష్ట్రాల్లో విద్యా సంస్థల పరిస్థితి ఈ విధంగా ఉంది. అటు తమిళనాడులో జూన్ 4 వ తేదీనే పాఠశాలలు ప్రారంభం కావడం విశేషం. ఇక కర్ణాటకలోనూ జూన్ 1 నే స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. కేరళలోనూ పాఠశాలలు జూన్ 1 నుంచే ఓపెన్ అయినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+