ఈ విషయాల్లో నిర్లక్ష్యం మిమ్మల్ని షుగర్ వ్యాధిగ్రస్తుల్ని చేస్తుంది.. జాగ్రత్త!!

ఆరోగ్యంగా ఉన్నామని భావించే చాలామంది ఏం చేసినా తమకేం కాదులే అన్నట్టు బిహేవ్ చేస్తారు. మంచి ఆహారపు అలవాట్లు ,కావలసినంత నిద్ర, క్రమబద్ధమైన జీవనశైలి అనేవి తమకు తెలీదు అన్నట్టు బతికేస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు తినడం.. ఎక్కడపడితే అక్కడ తినడం.. అర్ధరాత్రి దాకా నిద్రపోకపోవడం వంటివి చేస్తారు. అయితే ఇవి మీరు అనారోగ్యం బారిన పడుతున్నారు అని చెప్పడానికి సంకేతాలని చెబుతున్నారు వైద్యులు.

డయాబెటిస్ అతిపెద్ద సమస్య
ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు క్రమబద్ధమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. క్రమబద్ధమైన జీవన శైలి లేని వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ అతిపెద్ద అనారోగ్య సమస్యగా మారింది. వందలో 70 నుండి 80 మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు అంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

Negligence in these things will make you diabetic patient Beware

మన చేతులారా డయాబెటిస్ ను ఆహ్వానిస్తున్నాం
వంశపారంపర్యంగా డయాబెటిస్ రావడం మాత్రమే కాకుండా, మన చేతులారా మనం డయాబెటిస్ ను కొని తెచ్చుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆహారం, నిద్ర, జీవనశైలి విషయంలో నిర్లక్ష్యమే మనల్ని డయాబెటిస్ బాధితులుగా మారుస్తుంది. ప్రతిరోజు క్రమ పద్ధతిలో సమయానికి తగ్గట్టు ఆహారం తీసుకోకపోవడం, తీసుకునే ఆహారంలో జంక్ ఎక్కువగా తినటం చేస్తూ ఉంటారు చాలా మంది.

నిర్లక్ష్యానికి భారీ మూల్యం డయాబెటిస్
ప్రతిరోజు 7 నుండి 8 గంటల పాటు నిద్రపోకుండా అర్థరాత్రి దాకా లాప్టాప్ లకు మొబైల్ ఫోన్లకు టీవీలకు అంటుకొని ఉండడం, శారీరక వ్యాయామం లేకుండా, కనీసం చిన్న పని కూడా చెయ్యకుండా లగ్జరీగా బ్రతకాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఈ జీవన విధానమే, ఈ నిర్లక్ష్యమే చాలామందిని డయాబెటిస్ బాధితులుగా మారుస్తుంది.

డయాబెటిస్ వస్తే జీవితకాలం బాధ పడాల్సిందే.. జాగ్రత్త
ఒకసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే.. ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిందే.. డయాబెటిస్ తో పాటు డయాబెటిస్ అనుబంధ సమస్యలు కూడా అనేకం వస్తాయి. కళ్ళు, పళ్ళు, కిడ్నీలు, లివర్, గుండె, నరాలు, చర్మం ఇలా అన్ని డయాబెటిస్ కారణంగా ప్రభావితమవుతాయి. కనుక మనకు తెలియకుండా చేసే నిర్లక్ష్యం మనలను డయాబెటిస్ బాధితులుగా మారుస్తుంది అన్న విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+