నయా స్టైల్ 'ఎగ్ బుర్జీ'.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..!
రోజూ కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల అరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. రోజూ గుడ్డును ఏదో రూపంలో తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే గుడ్డుతో చాలామంది అనేక రకాల వంటలు చేసుకుంటారు. గుడ్డుతో ఆమ్లెట్, గుడ్డు పులుసు, ఫ్రై, ఎగ్ బుర్జీ చేసుకుంటారు. అయితే ఇప్పుడు నయా స్టైల్ ఎగ్ బుర్జీ తయారీని ఎక్కువగా చేసుకుంటున్నారు. మరి ఈ ఎగ్ బుర్జీ ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
ఎగ్ బుర్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే..కోడిగుడ్లు ఐదు లేదా ఆరు, నూనె తగినంత
పోపు గింజలు రెండు టేబుల్ స్పూన్ లు, ఉల్లిపాయలు రెండు, కరివేపాకు కొద్దిగా, బీన్స్ ముక్కలు ఒక కప్పు, క్యారెట్ ముక్కలు ఒక కప్పు,పసుపు కొద్దిగా, కొత్తిమీర తరుగు తీసుకోవాలి.
ఇక ఎగ్ బుర్జీ తయారీ విధానం చూస్తే.. ముందుగా ఉల్లిపాయలు బీన్స్, క్యారెట్ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎగ్ బుర్జీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి. అందులో నూనె పోయాలి. నూనె వేడయ్యాక పోపు గింజలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అందులో పసుపు వేయాలి. కొద్దిసేపు మగ్గించుకున్నాక అంచుల వెంబడి అనుకొని మధ్యలో ఎగ్స్ ను పగులగొట్టి పోయాలి.

ఇప్పుడు బీన్స్ మిశ్రమాన్ని , ఎగ్ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కారంను తగినంత వేయాలి. అదే విధంగా చివరిలో సన్నని కొత్తిమీర తరుగు వేసి దింపుకుంటే సరి.. సూపర్ టేస్టీ ఎగ్ బుర్జీ కర్రీ రెడీ అయినట్టే..
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
"గోంగూర పప్పు" ఇలా ట్రై చేస్తే ప్లేట్ ఖాళీనే.. -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications