Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెమట పట్టటం మంచిదే, ఆ సమయంలో కాదు - వీరికి అలర్ట్..!!

చెమట శరీరంలోని వ్యర్ధాలను తెలిగిస్తుంది. శారీరక శ్రమ ఎక్కువగా చేసినా.. వేడి ప్రదేశాల్లో ఉన్న చెమట ఎక్కువగా పడుతుంది. మరి కొంత మంది ఏసీలో ఉన్నా చెమట పడుతూనే ఉంటుంది. ఇలా చెమట పట్టడం వల్ల రెండూ రకాలుగా అంటే లాభాలు, నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ముఖ్యంగా రాత్రుళ్లు నిద్రలో చెమట పట్టడాన్ని నిర్లక్ష్యం చేయకూడని లక్షణం. ఇది వివిధ అనారోగ్యాలకు సంకేతం. అసలు చెమట మంచిదా.. కాదా.. ఏ సమయంలో

చెమట పట్టటం వలన ఆరోగ్యకరమైన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం మీద ఉన్న ఎన్నో విష పదార్ధాలను చెమట డీటాక్స్ చేస్తుంది. చెమట అనేది సీసం, పాదరసం, కాడ్నియం, అర్సెని క్ లాంటి విషపదార్థాల్నీ, ప్లాస్టిక్ రసాయనాల్నీ చర్మం లోతుల్లోంచి తొలగిస్తుంది. క్రమం తప్పకుం డా చెమట పట్టడం అనేది ఇతర రకాల ముఖ్యమైన హోమియోస్టాటిక్ విధులకు బాధ్యత వహిస్తుం ది. వీటిలో అధిక సూక్ష్మపోషకాలు, జీవక్రియ ప్రక్రియల వ్యర్థ ఉత్పత్తులు, శరీరం నుంచి విష పదార్థాల తొలగిస్తుంది. వాకింగ్, యోగా, వ్యాయామాలు చేసినప్పుడు చెమట పట్టడం వల్ల రక్త ప్రసరణ వేగవంతమై, ఆక్సిజన్ సరఫరా కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.అయితే చెమట ఆరోగ్యానికి ఒకరకంగా మంచిదే అయినా, రాత్రుళ్లు నిద్రలో పడుతున్నాయంటే కొన్ని ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చు.

Night sweats rarely cause anything serious Here are some ways to prevent

ఈ సమస్య తీవ్ర రూపం దాల్చక ముందే మేల్కొని సంబంధిత వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి జీవక్రియలతో పాటు ఇతర శారీరక విధులు నిర్వ ర్తించడంలో సమర్థంగా పనిచేస్తుంది. ఇది అత్యంత చురుగ్గా మారినప్పుడు హైపర్ థైరాయిడిజం బారిన పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా శరీరం వేడికి తట్టుకోలేక రాత్రిళ్లు చెమటలు పడుతుం టాయని చెబుతారు. నిద్ర సమయంలో కొంతమంది ఉన్నట్లుండి ఒత్తిడి, ఆందోళనలకు గురి అవుతూ ఉంటారు. అయితే దీని ప్రభావం మెదడు, శరీరంపై పడుతుందని, ఫలితంగా నిద్రలో చెమటలు పడుతుంటాయని చెబుతున్నారు. కొన్ని రకాల మానసిక రుగ్మతలు ఉన్నప్పుడు మనసులో ఒక రకమైన యాంగ్జైటీ, ఆందోళన మొదలవుతుంటాయని, ఇవి నిద్రలో చెమటలు పట్టేలా చేస్తాయని వివరిస్తున్నారు.

అదే విధంగా.. 40 దాటిన మహిళల్లో రాత్రుళ్లు నిద్రలో చెమటలు పడుతు న్నాయంటే, వారు మెనోపాజ్ ​కు చేరువవుతున్నారనడానికి సంకేతం. రాత్రిపూట నిద్రలో చెమటలు పట్టడమనేది తరచూ తలెత్తినా, అసౌకర్యంగా అనిపించినా ఆలస్యం చేయకుండా డాక్టర్లును సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+