Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆరెంజ్ తొక్కలో ఓ రేంజ్ బెనిఫిట్స్

ఆరెంజ్ పండు కంటే దాని తొక్కల్లో దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటే ఆశ్చర్యమే. ఈ తొక్కల్లో పాలి మిథాక్సీ ఫ్లేవోన్స్‌ (PMFs), హెస్పెరిడిన్ వంటి ఫ్లేవనాయిడ్‌లు, ఇతర ఫైటోకెమికల్స్ ఉండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్లేవనాయిడ్లు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, క్యాన్సర్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులను నిరోధిస్తాయి. 3.5 ఔన్సుల (సుమారు 100 గ్రాములు) ఆరెంజ్ తొక్క 136 mg విటమిన్ Cని అందిస్తుంది. విటమిన్ A, రాగి, కాల్షియం, మెగ్నీషియం, పీచు పదార్థాలు కూడా ఇందులో పుష్కలం.

ఆరెంజ్ తొక్కలు గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరం. వీటిలోని హెస్పెరిడిన్ రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. PMFs కొలెస్ట్రాల్‌ను కొన్ని ఔషధాల కంటే సమర్థవంతంగా తగ్గించగలవని నిపుణులు చెబుతున్నారు. అలర్జీ కారక హిస్టామైన్ విడుదలను తొక్కల్లోని సమ్మేళనాలు అడ్డుకుంటాయి. క్యాన్సర్ కణాల వృద్ధిని తొక్కలు మందగించి, స్క్వామస్ సెల్ కార్సినోమా వంటి తీవ్రమైన చర్మ క్యాన్సర్లను తగ్గిస్తాయి. రెగ్యులర్‌గా తొక్కలు తీసుకునే వారికి, పండు మాత్రమే తినేవారి కంటే ఊపిరితిత్తుల, చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ.

Orange Peel Benefits Your Secret Weapon for a Healthier Heart and Faster Metabolism with Rich Vitamin

బరువు తగ్గడానికి ఆరెంజ్ తొక్కలు చక్కటి పరిష్కారం. ఇవి జీవక్రియను మెరుగుపరిచి, శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. వైద్య నిపుణులు బరువు తగ్గేందుకు వీటిని సిఫార్సు చేస్తున్నారు. యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల అతిసారం, గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలను సైతం నయం చేస్తాయి. హాంగోవర్ తగ్గించుకోవడానికి 15-20 నిమిషాలు ఆరెంజ్ తొక్కలను మరిగించి, ఆ నీటిని టీ లాగా తాగాలి.

దంత క్షయాన్ని నివారించి, నోటి దుర్వాసనను తొలగించి, శ్వాసను తాజాగా ఉంచడంలో తొక్కలు తోడ్పడతాయి. తద్వారా నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. విటమిన్ C, విటమిన్ Aతో సమృద్ధిగా ఉండే ఆరెంజ్ తొక్కలు సహజ యాంటీఆక్సిడెంట్‌లుగా పనిచేస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, సూక్ష్మక్రిములు, వైరస్‌లతో పోరాడి, అంటువ్యాధులు, జలుబు, ఫ్లూ నుండి రక్షణ కల్పిస్తాయి. బ్లాక్‌హెడ్స్, మొటిమలు, డార్క్ సర్కిల్స్, పొడి చర్మం వంటి అనేక సమస్యలను ఇవి నయం చేస్తూ, చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.

నారింజ తొక్కలలో పండు కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది, ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. వీటిలోని సిట్రిక్ యాసిడ్ చర్మ రంధ్రాలను శుభ్రపరిచి, అధిక నూనెను తొలగిస్తూ మొటిమలను నివారిస్తుంది. అలాగే, నారింజ తొక్కల సహజ బ్లీచింగ్ గుణాలు చర్మంపై నల్ల మచ్చలు, సూర్యరశ్మి టానింగ్‌ను తొలగిస్తాయి. తద్వారా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

తొక్కలను ఎండబెట్టి, పొడిగా చేసుకుని ఈ క్రింద పేర్కొన్న ఫేస్ ప్యాక్‌లుగా ఉపయోగించుకోవచ్చు. ఇది తక్షణ తాజాదనాన్ని అందిస్తుంది. పొడి చర్మం గల వారు ఒక టీస్పూన్ నారింజ తొక్క పొడిని తగినంత తేనెతో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది చర్మంలో తేమను నిలిపి ఉంచడానికి, మృదుత్వాన్ని పెంచడానికి సహాయపడుతుంది. నారింజ తొక్క పొడి, చందనం పొడిని రోజ్ వాటర్‌లో కలిపి ప్యాక్‌గా వాడుకోవచ్చు. ఈ మిశ్రమం ముఖంపై అధిక నూనెను తగ్గించి, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.

Disclaimer: నారింజ తొక్కలను నేరుగా ముఖంపై రుద్దడం వల్ల చికాకు కలగొచ్చు. అందుకే ఎప్పుడూ పొడి రూపంలో లేదా ఇతర పదార్థాలతో కలిపి వాడాలి. సున్నితమైన చర్మం గలవారు ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ (Patch Test) చేయడం మంచిది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+