అతి నిద్రతో అనర్ధాలు... అనేక రోగాలు... జాగ్రత్త!
చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇంకొంతమంది అతినిద్ర సమస్యతో బాధపడుతున్నారు. నిద్ర తక్కువైనా ఎక్కువైనా రెండు సమస్యలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర సరిపోకపోతేనే కాదు నిద్ర ఎక్కువైనా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అతినిద్ర ప్రమాదకరమని చెబుతున్నారు.
అతి నిద్ర... డేంజర్
అతిగా నిద్ర పోవడం కూడా నిద్రకు సంబంధించిన రుగ్మతలలో ఒకటి. దీనిని హైపెర్సోమ్నియా అని అంటారు. నిద్రపోక పోవటాన్ని ఇన్సోమ్నియా అంటారు. ఇక ఈ రెండూ డేంజర్ అంటున్నారు. కావలసిన దానికంటే ఎక్కువ నిద్రపోతే మన శరీరంలోని జీవక్రియలో తేడాలు వస్తాయి. దీంతో ఒత్తిడి ఆందోళన పెరుగుతాయి. కనుక ఎక్కువ సేపు నిద్రపోవడం అంత మంచిది కాదు.

అతిగా నిద్ర పోతే అనారోగ్య సమస్యలు
ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల రోజంతా అలసిపోయినట్టు భావన కలుగుతుంది. శరీరం యాక్టివ్ గా అనిపించదు. శరీరం మెటబాలిజం దెబ్బతింటుంది. ఇది బరువు పెరగడానికి ప్రధాన కారణం అవుతుంది. ఇక నిద్ర ఎక్కువ అయితే మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. జ్ఞాపకశక్తి సమస్యలు కూడా వస్తాయి. కనుక కావాల్సిన దాని కంటే ఎక్కువ నిద్రపోవడం ఏమాత్రం మంచిది కాదు.
అతి నిద్రతో ఆయుష్షు తగ్గుతుంది
తరచూ ఎక్కువ సేపు నిద్రపోతే ఆయుష్షు కూడా తగ్గుతుందని అనేక అధ్యయనాలలో తేలింది. ఇక ఎటువంటి శారీరక శ్రమ లేకుండా అధిక సమయం నిద్రించడం కారణంగా నడుము నొప్పి వేధిస్తుంది. అధిక నిద్రతో గుండెకు కూడా ముప్పు వాటిల్లుతుంది. హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది..
ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం కూడా ఉంది. తక్కువ నిద్రపోవడం ఎంత డేంజర్ నో అతిగా నిద్రపోవడం కూడా అంతే డేంజర్ అని చెబుతున్నారు వైద్య నిపుణులు. దీర్ఘకాలిక వైద్య పరిస్థితులు, మానసిక ఆరోగ్య సమస్యలు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, శారీరక వ్యాయామం లేకపోవడం కొన్ని రకాల మందులను వాడడం, నిద్రలేమి, గుండె జబ్బులు, మధుమేహం వంటి కారణాలు కూడా అతినిద్రకు ప్రధాన కారణాలు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications