over thinking impact: అతిగా ఆలోచిస్తే... మీ హెల్త్ డేంజర్ లో!!
చాలామంది ప్రతి చిన్న విషయాన్ని చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఆలోచనలు చేసే వారు అనేక అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆందోళన చెందితే ఆ ప్రభావం శారీరకంగాను, మానసికంగాను పడుతుందని, అది అనారోగ్యాలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అలాంటివారికి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు, మానసిక ఆందోళన, రక్తపోటు సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే మెదడు కణాలపై ఒత్తిడి పెరగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు చాలాకాలం పాటు కొనసాగవచ్చని హెచ్చరిస్తున్నారు.

చిన్న చిన్న సమస్యలకు కూడా ఎక్కువగా ఆందోళన చెందేవారిలో హార్మోనల్ ఇన్ బాలన్స్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఆందోళన చెందే వారిలో సంతోషకరమైన హార్మోన్లు ఉత్పత్తి కావని, శరీరానికి హాని చేసే హార్మోన్ల ఉత్పత్తి జరుగుతుందని చెబుతున్నారు. ప్రతి దానికి సీరియస్ గా ఆలోచించడం వల్ల తలనొప్పి వేధించే అవకాశం ఉంటుందని, శరీరంలో రోగనిరోధకశక్తి బలహీన పడుతుందని చెబుతున్నారు. తీవ్రంగా డిప్రెషన్ బారిన పడే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.
శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు రకరకాల రోగాలు మన పైన ఎటాక్ చేసే అవకాశం ఉంటుందని, చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుండి దీర్ఘకాలిక వ్యాధుల వరకు మనల్ని టార్గెట్ చేసి మన ఆరోగ్యాన్ని మరింత దిగజార్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఒకే విషయం గురించి ఎక్కువగా ఆలోచించే వారిలో చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని, టెన్షన్ చర్మ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుందని చెబుతున్నారు శరీరంలో క్యాన్సర్ కణాలు పెరిగే ప్రమాదం ఉందని, అతిగా ఆలోచించడం వల్ల శరీరంలో జరిగే మార్పులతో క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అందుకే అతిగా ఆలోచించటం మానుకుని, సమయానుకూలంగా పనులు చేసుకోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications