మిరపకాయల పచ్చడి.. సూపర్ రుచిగా, తింటే మీరు నవ యవ్వనంగా!
రోటి పచ్చడి లకు మన ఆహారంలో చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. మనో రకరకాల కూరగాయలతో రోటి పచ్చళ్ళు తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే చాలామందికి పచ్చి మిరపకాయలతో కూడా పచ్చడి చేసుకుని తినొచ్చు అనే విషయం తెలీదు. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే మిరపకాయలు రోటి పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందాం.
పచ్చి మిరపకాయల పచ్చడి
ఈ పచ్చడి తింటే ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా, చర్మం ముడతలు రాకుండా నవ యవ్వనంగా ఉంటుంది. మిరపకాయలలో ఉండే లైకోపీన్ మనల్ని యంగ్ గా ఉంచేలా చేస్తుంది. మరి మిరపకాయల పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

తయారీకి కావలసిన పదార్థాలు
పచ్చి మిరపకాయలు- 200 గ్రాములు
చింతపండు- నిమ్మకాయంత
ఉప్పు- రెండు స్పూన్లు
జీలకర్ర -రెండు టేబుల్ స్పూన్లు
వెల్లి పాయలు- ఆరు రెబ్బలు
కరివేపాకు- రెండు రెమ్మలు
ధనియాలు- ఒక టేబుల్ స్పూన్
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
ముందుగా పచ్చిమిరపకాయలను తొడిమలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని, స్టవ్ వెలిగించి స్టౌ పైన ఒక పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ మిరపకాయలను చింతపండు తో కలిపి వేసి బాగా మగ్గించాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. రోటి పచ్చడి రోట్లో చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ రోలు లేకపోతే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు.
మిరపకాయ పచ్చడి తయారీ ఇలా
మిక్సీలో మిరపకాయలు, చింతపండు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లిపాయ రెబ్బలు, కరివేపాకు అన్ని వేసి గ్రైండ్ చేయాలి. ఈ పచ్చడికి కొంచెం చింతపండు ఎక్కువనే ఉపయోగించాలి. కారం ఎక్కువగా ఉన్న మిరపకాయలు తీసుకుంటే కొంచెం చింతపండును ఎక్కువగా వేయండి. గ్రైండ్ చేసిన పచ్చడిని తిరిగి పోపు చేసుకోవచ్చు. లేదా నేరుగా కూడా తినవచ్చు.
మిరపకాయ పచ్చడితో ఆరోగ్యం
ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా బాగుంటుంది. మిరపకాయ పచ్చడి ని తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగుపడుతుంది. జలుబు, దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.












Click it and Unblock the Notifications