రెస్టారెంట్ స్టైల్ 'పాలక్ పనీర్' కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..!
పాలక్ పనీర్.. ఈ పేరు వింటేనే చాలామందికి నోరు ఊరుతుంది. ఈ స్పెషల్ పంజాబీ వంటకానికీ తెలుగు రాష్ట్రాల్లోనూ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఈ సూపర్ టేస్టీ వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇక్కడ చూడండి.. పాలక్ పనీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. పాలకూర కట్టలు 3, పనీర్ 350 గ్రాములు, ఉల్లిపాయ ఒకటి, టమోటాలు, పచ్చిమిర్చి తగినన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు, కారం కొద్దిగా, మసాలా, నూనెను తీసుకోవాలి.
పాలక్ పనీర్ కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి వేడి నీటిలో 5 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచి ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత చల్లటి నీటిలో వేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత పాలకూరను పచ్చిమిర్చితో కలిపి మిక్సీలో వేయాలి. రోటిలో గానీ మిక్సీలోగానీ వేసి మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఓ గిన్నె పెట్టుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఓ టీ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకులు వేయాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలను వేసి గోల్డ్ కలర్ వచ్చేంతవరకూ బాగా వేయించుకోవాలి.

ఇప్పుడు అందులో ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. ఆ తర్వాత టమాటోలు వేసి రుచికి తగినంత ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అదే మిశ్రమానికి పసుపు, హాఫ్ స్పూన్ కారంతోపాటు మసాలాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలకూర పేస్టును గిన్నెలో వేసి ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చివరగా పన్నీర్ ముక్కలను వేసి మరో 2 నిమిషాలు ఉంచి కిందకు దించుకోవాలి. అంతే రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ పాలక్ పనీర్ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications