బొప్పాయితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, వీరికి మాత్రం మహా డేంజర్..!!
బొప్పాయి పండు. ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు అందిస్తుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. రక్తం కూడా వృద్ధి చెందుతుంది. అయితే బొప్పాయి పండును తినేవారు మాత్రంకొన్ని సూచనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే పండు తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు. బొప్పాయి తినటం వలన కొందరిలో సమస్యలు వస్తాయి. అతిగా తినటం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఎవరు తినకూడదో కూడా స్పష్టం చేస్తున్నారు.
బొప్పాయి పండు ఒక కప్పు కంటే ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదని చెబుతున్నారు. ఈ పండును బాగా తింటే ఎవరికైనా అన్న వాహికకు ఎఫెక్ట్ అవుతుంది. కనుక ఎప్పుడు ఈ పండును తిన్నా ఒక కప్పుకు మించరాదు. గర్భిణీలే కాదు, పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయి పండును తినరాదు. తింటే వారు ఇచ్చే పాలతో పలు రసాయనాలు బిడ్డ శరీరంలోకి వెళ్తాయి. దీంతో అవి శిశువులకు లోపాలను కలిగిస్తాయి. బీపీ సమస్యతో బాధపడేవారు, బీపీ ట్యాబ్లెట్లు వేసుకునే వారు బొప్పాయి పండును తినరాదు. తింటే సమస్య తీవ్రతరమవుతుంది. లో బ్లడ్ షుగర్ సమస్యతో బాధపడేవారు బొప్పాయి తినరాదు. తింటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు ఇంకా పడిపోతాయి. కనుక వారు తినరాదు. బొప్పాయి పండును తినే పురుషులు వాటి విత్తనాలను తినకుండా, అవి లోపలికి పోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అవి పురుషుల్లో వీర్యాన్ని నాశనం చేస్తాయి.

ఇక బొప్పాయి పండును ఎవరైనా చాలా తక్కువగా తినాలి. రోజూ తినవచ్చు కానీ ఒక కప్పు మించ కూడదు. బొప్పాయి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ తరువాత ఒక గంట విరామం ఇచ్చి తినవచ్చు. లేదా మధ్యాహ్నం భోజనం అనంతరం ఒక గంట విరామం ఇచ్చి తినవచ్చు. బొప్పాయి పండ్లలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వర్షాకాలంలో వచ్చ బ్యాక్టీయర్ ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడటంతో మేలు చేస్తుంది. బొప్పాయి ఎప్పుడు తిన్నా పరిమితంగా.. రోజూ తీసుకుంటే ఆరోగ్య పరమైన ప్రయోజనాలు అందుతాయి. పరిమితి దాటి తీసుకుంటే సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications