దసరా వేళ ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు గుడ్ న్యూస్ - దర్శనం ఇక నుంచి..!!
దసరా వేడుకలకు ఇంద్రీకీలాద్రి ఆలయం ముస్తాబు అవుతోంది. ఆలయ పాలకవర్గం ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత దక్కే విధంగా నిర్ణయాలు అమలు కు సిద్దమయ్యారు. అదే విధంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందిస్తోంది. ఈ మేరకు ఆలయ అధికారులు భక్తులకు సమాచారంతో పాటుగా సూచనలు చేస్తున్నారు.
దసరా శరన్నవరాత్రుల కోసం ఇంద్రీకీలాద్రి పైన కొలువు అయి ఉన్న కనకదుర్గమ్మ ఆలయం లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల వేళ ఉచితంగా దుర్గమ్మ దర్శనం భక్తులకు కల్పించాలని నిర్ణయించారు. ప్రస్తుతం దర్శనం కోసం అమల్లో ఉన్న రూ.100, రూ.300, రూ.500 దర్శన టికెట్ల విధానాన్ని దసరా సందర్భంగా రద్దు చేశారు. టికెట్లతో అవసరం లేకుండా అందరికీ ఉచిత దర్శన భాగ్యం కల్పించనున్నారు.

అన్ని క్యూలైన్లలోకి ఉచితంగా ప్రవేశంచి అమ్మవారి దర్శనం చేసుకునే వెసులు బాటు కల్పించారు. శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు భక్తులు ఎలాంటి టికెట్ లేకుండా దుర్గమ్మను దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. అన్ని క్యూలైన్లను ఉచిత క్యూలైన్లగా కొనసాగించనున్నారు. అదే విధంగా వీఐపీ దర్శనాల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు.
వీఐపీ దర్శనంతో పాటుగా సిఫార్సులపై వచ్చే భక్తుల కోసం భవానీ ప్రత్యేక దర్శనం పేరుతో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అధికార సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులకు ఈ ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శన అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, వీరికి టికెట్ ధర రూ.వెయ్యిగా నిర్ణయించారు. ఈ టికెట్ తీసుకుని ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఈ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇంద్రకీలాద్రి సమీపంలోని కుమ్మరిపాలెం వద్ద టీటీడీ స్థలంలో ఈ టికెట్లను జారీ చేసేందుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు.
ఇక్కడికి వెళ్లి ఆఫ్లైన్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు. భక్తుల కోసం ప్రత్యేకంగా కాళేశ్వరరావు మార్కెట్, స్వరాజ్య మైదానం వద్ద కూడా దర్శన టికెట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రూ.వెయ్యి దర్శనం టికెట్ తీసుకున్న భక్తులను ప్రత్యేక వాహనాల్లో కొండపైకి తీసుకొస్తారు. అనంతరం ప్రత్యేక క్యూలైన్ల ద్వారా నేరుగా దర్శనానికి అవకాశం కల్పిస్తారు. దసరా సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.














Click it and Unblock the Notifications
