perugu vada.. రెస్టారెంట్ స్టైల్ పెరుగు వడలు.. ఇలా చేస్తే సూపర్ రుచులు!

మనం తీసుకునే ఆహారంలో బ్రేక్ ఫాస్ట్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకునే ఆహారం కూడా మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించేలా ఉండాలి. అటువంటి ఆహారాలలో దహి వడ ఒకటి. వీటినే పెరుగు వడలు అని కూడా అంటారు. ఈ పెరుగు వడలను, చాలా సాఫ్ట్ గా రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేయాలి. అలా రావాలంటే ఎటువంటి చిట్కాలను పాటించాలి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

పెరుగు వడలు తయారీ కి కావలసిన పదార్థాలు

మినప్పప్పు- ఆరేడు గంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకున్న ది

ఉప్పు- రుచికి తగినంత

పచ్చిమిరపకాయలు- 4

అల్లం- చిన్న ముక్క

కరివేపాకు- రెండు రెమ్మలు

నూనె- పావు కిలో

Perugu Vada Dahi Vada Recipe How To Make Soft Restaurant Style dahi Vadas At Home

పెరుగు వడలు తయారీ

ముందుగా పెరుగు వడలు తయారు చేయడానికి మినపప్పును ఆరేడు గంటల పాటు నానబెట్టుకొని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మెత్తగా రుబ్బుకోవాలి. ఎక్కువ నీరు పోయకుండా, కొద్దికొద్దిగా నీరు పోస్తూ రుబ్బుకోవాలి. మనం చేత్తో వడ చేసుకొని వేసుకోవడానికి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతే ఉండేలా చూసుకోవాలి. ఈ మినపప్పుతో పాటే పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు, కరివేపాకు కూడా వేసి రుబ్బుకోవాలి.

వడలు చేసుకున్నాక ఇలా తప్పక చెయ్యాలి

పిండిని గిన్నెలో వేశాక పిండిని బాగా కలిపి బోలుగా వచ్చేలా చూడాలి. పిండి బాగా కలిపాక చిన్న ముద్దను నీటిలో వేస్తే అది తేలాలి. అప్పటిదాకా పిండిని కలపాలి. తేలినట్టు చూశాక స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి, నూనె కాగిన తర్వాత అందులో వడల పిండిని వడలా చేసుకుని మధ్యలో చిన్న రంధ్రం చేసి వేసి వడలు కాల్చుకోవాలి. ఆ తర్వాత వడలను తీసి నీళ్ళలో వేసి, పిండి వేరే గిన్నెలో వేసుకోవాలి.

పెరుగులో వడలు ఇలా వేసుకోవాలి

ఆ తర్వాత వడలను పెరుగులో వేసుకోవడానికి పెరుగులో కొద్దిగా ధనియాల పొడి, లైట్ గా సాల్ట్ కలిపి బాగా గట్టిగా, బాగా పలుచగా లేకుండా, మీడియం చిక్కగా ఉండేలా చూసుకోవాలి. అందులో కొద్దిగా పోపు వేసి కలుపుకోవాలి. ఆపై వడలు అన్నింటిని పెరుగులో నానబెట్టి ఐదారు గంటల తర్వాత తింటే వడ చాలా సాఫ్ట్ గా, టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ లో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+