పెసలు మసాలా కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు!

ప్రతిరోజూ ఏం కూర వండాలా అని ఆలోచించే గృహిణులకు ఒక అద్భుతమైన కూర గురించి తప్పక చెప్పాలి. కూరగాయలు అయిపోయిన రోజుల్లో చాలా ఉపయోగపడే ఒక సులభమైన, బలవర్ధకమైన కూర పచ్చ పెసలతో చేసే గ్రేవీ కర్రీ. చాలామంది పెసలతో పెసరట్టు లేదా గుడాలు మాత్రమే చేస్తారు. కానీ ధాబా స్టైల్‌లో మసాలా గ్రేవీగా చేస్తే రుచి చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు.

పచ్చ పెసల్లో ప్రోటీన్లు, పీచు పదార్థాలు, ఇనుము, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శాకాహారులకు మంచి ప్రోటీన్ మూలం. పచ్చ పెసలు జీర్ణశక్తి పెంచుతుంది, రక్తహీనత నివారణకు సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా మంచిది. రోజూ తినేది కాబట్టి రుచిగా, ఆరోగ్యకరంగా ఉండేలా చేసుకోవచ్చు.

pesalu masala curry Healthy Whole Green Moong Dal Curry Recipe - Protein-Rich Pesalu Gravy for Chapati Roti amp amp Rice

కావాల్సిన పదార్థాలు

పచ్చ పెసలు - 1 కప్పు ,
టమాటా - 1 మీడియం సైజ్ టమాటా
ఉల్లిపాయ - ఒకటి సన్నగా తరిగినది
పసుపు - పావు స్పూన్ ,
ఉప్పు - రుచికి సరిపడా,
నూనె - 3 టేబుల్ స్పూన్లు,
హోల్ గరం మసాలా - (లవంగాలు, దాల్చినచెక్క, ఇలాచీ, బిర్యానీ ఆకు),
జీలకర్ర - పావు స్పూన్ ,
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ ,
కారం పొడి - 1 స్పూన్ ,
ధనియాల పొడి - అర స్పూన్,
జీలకర్ర పొడి - పావు స్పూన్,
పెరుగు - 2 స్పూన్స్ ,
కొత్తిమీర తరుగు- కొద్దిగా

తయారీ విధానం:

ముందుగా పెసలను బాగా శుభ్రం చేసి పాన్‌లో మీడియం మంటపై మాడిపోకుండా దోరగా వేయించండి. సువాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్‌లో వేయించిన పెసలు, చిన్నగా తరిగిన టమాటా, పసుపు, ఉప్పు, 2½ కప్పుల నీళ్లు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేడి చేయండి. హోల్ గరం మసాలా దినుసులు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి.

సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి లైట్ బ్రౌన్ రంగు వచ్చే వరకు బాగా వేయించండి. అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించండి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపండి. పెరుగు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఉడికించిన పెసలు-టమాటా మిశ్రమాన్ని నీటితో సహా వేసి కలపండి. గ్రేవీ చిక్కదనం కావాలంటే కొంచెం నీళ్లు జోడించి 4-5 నిమిషాలు మూతపెట్టి ఉడికించండి.

నూనె పైకి తేలిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి.వేడి చపాతీలు, పుల్కాలు లేదా జీరా రైస్‌తో వడ్డిస్తే రుచి చాలా బాగుంటుంది. కాస్త మసాలా ఎక్కువ కావాలంటే కారం పెంచుకోవచ్చు. మరింత ఆరోగ్యకరంగా కావాలంటే నూనె తగ్గించి, వెన్న బదులు కొద్దిగా పెరుగు వాడవచ్చు.

పుచ్చకాయ చెక్కు పచ్చడి.. ఎప్పుడూ ట్రై చెయ్యకుంటే ఇప్పుడు చెయ్యండి!
పుచ్చకాయ చెక్కు పచ్చడి.. ఎప్పుడూ ట్రై చెయ్యకుంటే ఇప్పుడు చెయ్యండి!

ఈ పెసలు మసాలా కర్రీ రెండు-మూడు రోజులు ఫ్రిజ్‌లో ఉంచుకుని తినవచ్చు.ఈ పెసల కర్రీ కేవలం రుచికరం మాత్రమే కాదు, పోషకాలు నిండిన ఒక పూర్తి భోజనం. రోజూ వేర్వేరు కూరలు వండాలని అనిపించినప్పుడు ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది. ఒక్కసారి చేసి చూడండి, ఇంట్లో అందరూ మళ్లీ చేయమని అడుగుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+