వినాయక చవితి స్పెషల్.. పెసరపప్పు పాయసం!

వినాయక చవితి పండుగకు అందరూ రెడీ అవుతున్నారు. వాడవాడలా గణనాధుడు మండపాలలో పూజలు అందుకోనున్నారు. వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, పాల తాలికలు, ఉండ్రాళ్ళ పాశం ఇలా ఎన్నో నైవేద్యాలు ఎలా తాయారు చేసుకోవాలో ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా గణపతికి ఇష్టమైన పాయసం తయారీ తెలుసుకుందాం. పెసరపప్పు, బియ్యం, బెల్లం పాలతో తయారు చేసే ఈ పాయసం చాలా స్పెషల్.

కావాల్సిన పదార్ధాలు (4-5 మందికి):

పెసరపప్పు - ½ కప్పు
బియ్యం - ¼ కప్పు
బెల్లం - ¾ నుంచి 1 కప్పు (రుచికి తగ్గట్టు)
పాలు - 3 కప్పులు
నీళ్లు - 1½ కప్పు
నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు
ఏలకులు పొడి - ½ టీస్పూన్
జీడిపప్పు, బాదం, కిస్మిస్ - కొద్దిగా

pesarapappu payasam Easy recipe for traditional Telugu payasam made with moong dal rice and jaggery for ganesh chaturthi

తయారీ విధానం:

ముందు పెసరపప్పు, బియ్యం కలిపి బాగా కడగండి. 20-30 నిమిషాలు నానబెట్టండి. ఆపై ప్రెషర్ కుక్కర్‌లో నానబెట్టిన పెసరపప్పు, బియ్యం, 1½ కప్పు నీళ్లు పోసి 4-5 విజిల్స్ వచ్చేలా ఉడికించండి. బాగా మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత తీసి మెత్తగా దానిని మాష్ చేసుకోవాలి. ఆపై ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి వేపి పక్కన పెట్టండి.

ఇలా చేస్తే పెసరపప్పుతో చేసిన పాయసానికి రుచి

అదే నెయ్యిలో ఉడికించి మెత్తగా చేసుకున్న పెసరపప్పు-బియ్యం మిశ్రమం వేసి 3-4 నిమిషాలు మళ్ళీ ఉడికించాలి. ఆపై అందులో పాలు పోసి బాగా కలిపి ఉడికించండి. అందులోనే బెల్లం తురుమి వేసి కరిగే వరకు కలుపుతూ ఉడికించండి. పాయసం కావాల్సిన చిక్కదనం వచ్చే వరకు 8 నుండి10 నిమిషాలు ఉడికించండి. చివరగా ఏలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపండి.

బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు.. గణనాధుడు కూడా ఇష్టపడేలా మెచ్చుకునేలా ఇలా చెయ్యండి!
బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు.. గణనాధుడు కూడా ఇష్టపడేలా మెచ్చుకునేలా ఇలా చెయ్యండి!

ఈ పాయసం వినాయకుడికి నైవేద్యంగా పెడితే గణనాధుడికి చాలా ఇష్టం

అంతే రుచికరమైన పెసరపప్పు, బియ్యంతో తయారు చేసిన పాయసం రెడీ. ఈ పాయసం వినాయకుడికి నైవేద్యంగా పెడితే గణనాధుడికి చాలా ఇష్టం. దేవుడికి నైవేద్యంగా పెట్టిన ఈ పాయసం, ప్రసాదంగా మీరు రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+