ఈ సీజన్లో బరువు తగ్గించే, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే సూపర్ ఫ్రూట్ ఇదే!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు తగ్గట్టు ఆహారం.తీసుకోవాలి. ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. మన శరీరానికి అన్ని విధాల పోషకాలు ఇచ్చే ఆహారాన్ని తీసుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇక అటువంటి పౌష్టికాహారంగా మనం పండ్లను కూడా చెప్పవచ్చు. అయితే పండ్లను ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
పైనాపిల్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
ఎండాకాలంలో పైనాపిల్ ఎక్కువగా వస్తుంది. ఈ సీజన్లో పైనాపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి పైనాపిల్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరం డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. మనం తీసుకునే ప్రోటీన్ ను బ్రేక్ చేసే ఎంజైమ్స్ పైనాపిల్ లో చాలా ఉంటాయి. వీటివల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పైనాపిల్ లో విటమిన్ సి తో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

పైనాపిల్ లో క్యాలరీ ఫ్రూట్
పైనాపిల్ లో ఉండే అనేక పోషకాలు ముఖ్యంగా పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు హై బీపీని తగ్గించి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చాలామంది వేసవిలో ఎనర్జీ డౌన్ అవుతున్నట్లుగా భావిస్తూ ఉంటారు. అటువంటి వారికి పైనాపిల్ లో ఉండే న్యాచురల్ షుగర్ మన ఎనర్జీని బూస్ట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక పైనాపిల్ ఒక లో క్యాలరీ ఫ్రూట్ గా మనం చెప్పొచ్చు.
పైనాపిల్ రోజూ తింటే బరువుకు చెక్
దీనిని తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గడానికి కూడా ఎంతగానో దోహదం చేస్తుంది. పైనాపిల్ రెగ్యులర్ గా తీసుకునేవారు వేగంగా బరువు తగ్గుతారు. ఇతరత్రా ఆహారాలను తీసుకోకుండా ఒక పైనాపిల్ మాత్రమే ఆహారంగా తీసుకుంటే ఐదు రోజుల్లో ఐదు కిలోలు బరువు తగ్గే వారు కూడా ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా పైనాపిల్ డైట్ ను చాలామంది డాక్టర్లు కూడా రిఫర్ చేస్తున్నారు.
పైనాపిల్ మితంగానే తినాలి
అయితే ఈ పైనాపిల్ డైట్ ను రెండు రోజులకు మించి చేయడం మంచిది కాదు అని కూడా పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మనకు పైనాపిల్ కలిగించే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకొని దీనిని పరిమితి మేరకు ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. అతిగా పైనాపిల్ తింటే నోరు కొట్టుకుపోయి కొత్త సమస్య వస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications