పింక్ బ్యూటీ అలియా భట్ బ్యూటీ సీక్రెట్.. ఫాలో అయితే మీరూ మెరిసిపోతారు!!
అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని కోరుకోనివారు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరు అందంగా ఉండాలనే కోరుకుంటారు. సినీ తారలు అందంగా ఉండడానికి ఖరీదైన కాస్మటిక్స్ ను ఉపయోగిస్తారని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే సినీ తారలు కూడా అందంగా కనిపించడానికి చాలా న్యాచురల్ రెమిడీస్ ట్రై చేస్తారనే విషయం, అది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి అనే విషయం చాలామందికి తెలియదు.
ప్రస్తుతం మనం అలియా భట్ లేత నాజూకు గులాబీ రంగు చర్మ రహస్యాన్ని తెలుసుకుందాం. ఇది తెలుసుకున్న తర్వాత ఈ సీక్రెట్ ను మీరు ఫాలో అయితే అలియా భట్ లా మెరిసిపోవచ్చు. అలియా భట్ ను బాలీవుడ్ ఇండస్ట్రీలో పింక్ బ్యూటీ అంటారు. ఎందుకంటే గులాబీ రంగులో ఆమె చర్మం మెరిసిపోతూ ఉంటుంది.

అలియా భట్ లాగా మీరు కూడా గులాబీ రంగు చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే ఆమె ఫాలో అయ్యే ప్రత్యేక బ్యూటీ టిప్ ను మీరు కూడా తెలుసుకోవాల్సిందే. అలియా భట్ తను అందంగా ఉండడం కోసం, తన చర్మం నిగారింపు కోసం చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ఒక టిప్ ను ఫాలో అవుతారు .అలియా భట్ అందం యొక్క రహస్యం హైడ్రేటింగ్ మాస్క్.
అలియా భట్ తన ముఖ సౌందర్యం కోసం చియా సీడ్స్ హైడ్రేటింగ్ మాస్క్ ను ఉపయోగిస్తారు. ఇక ఈ మాస్క్ ని ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒక స్పూన్ చియా సీడ్స్ ను పాలలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయానికి అది చక్కని పేస్టులా తయారవుతుంది. ఇక ఆ పేస్టులో ఒక స్పూన్ తేనె కలుపుకొని ఫేస్ మాస్క్ గా వేయాలి. దాదాపు 15 నిమిషాల పాటు ఆ మాస్క్ ను ఆరనివ్వాలి.
ఆ తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చియా సీడ్స్ తో చేసిన మాస్క్ అప్లై చేయడం వల్ల ముఖం హైడ్రేటెడ్ గా ఉంటుంది. చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. చర్మం ఎర్రబారడం, పొడిబారడం వంటివి తగ్గుతాయి. ఈ ఫేస్ మాస్క్ ట్రై చేస్తే అలియా లా అందంగా మీరూ కనిపించొచ్చు.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications