రోజూ దానిమ్మ తింటే మీ గుండెకు ఎంత మేలు జరుగుతుందో తెలుసా?

రుచికరమైన ఎర్టి గింజలతో అందరినీ ఆకట్టుకునే దానిమ్మ పండు కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. పెరుగులో వేసుకుని తిన్నా, సలాడ్లలో కలుపుకున్నా లేదా అలాగే తిన్నా దానిమ్మ ఎప్పుడూ ప్రత్యేకమే. అయితే, ఈ పండు కేవలం రుచికరమైనది మాత్రమే కాదని, గుండె ఆరోగ్యానికి సంబంధించి పరిశోధకులను సైతం ఆశ్చర్యపరుస్తున్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని ద్వారా మన ఆరోగ్యానికి అందే ప్రయోజనాలు ఎంతో విశేషమైనవిగా నిపుణులు చెబుతున్నారు.

దానిమ్మ పండ్లు తిన్న తర్వాత మన శరీరంలో తయారయ్యే 'యురోలిథిన్ ఏ' (Urolithin A) అనే సమ్మేళనంపై శాస్త్రవేత్తలు తాజాగా పరిశోధనలు జరిపారు. జంతువులపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ సమ్మేళనం గుండె పనితీరును మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేసినట్లు తేలింది. గుండె కండరాలు సడలడంలో సహాయపడటం, గుండెలో మచ్చలు (fibrosis) ఏర్పడటాన్ని తగ్గించడం ,గుండె పరిమాణం హానికరంగా పెరగకుండా నిరోధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, నేరుగా మనుషులపై క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Discover how pomegranates help improve heart function by up to 80 percent according to early research and explore five easy and healthy recipes to try at home

ప్రయోగాల ఫలితాలకు, సాధారణ వినియోగానికి తేడా

జంతువులపై జరిగిన ప్రయోగాల్లో గుండె పనితీరు మెరుగైందని తేలినప్పటికీ, రోజూ దానిమ్మ పండ్లు తింటే మనుషులలో గుండె పనితీరు 80 శాతం మెరుగవుతుందని దీని అర్థం కాదు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అలాగే ఇళ్లలోనే మందుల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోవాల్సిన పనిలేదు. అయితే మీ రోజువారీ ఆహారంలో దానిమ్మను భాగం చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దీన్ని మరింత రుచికరంగా తీసుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

దానిమ్మ పండు తింటున్నారా? అయితే ఇది మీ కోసమే!
దానిమ్మ పండు తింటున్నారా? అయితే ఇది మీ కోసమే!

దానిమ్మతో ఇంట్లోనే తయారుచేసుకోదగిన 5 సులభమైన వంటకాలు

దానిమ్మ యోగర్ట్ బౌల్:

చిక్కటి పెరుగులో దానిమ్మ గింజలు, సన్నగా తరిగిన వాల్‌నట్స్, చిటికెడు దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి. కావాలనుకుంటే ఓట్స్ లేదా అరటిపండు ముక్కలు, కొద్దిగా తేనె జోడించుకుంటే రుచికరమైన అల్పాహారం సిద్ధమవుతుంది.

దానిమ్మ చాట్:

దానిమ్మ గింజలతో పాటు దోసకాయ, టొమాటో, ఉడికించిన శనగలు, కొత్తిమీర వేసి కలపాలి. అందులో నిమ్మరసం, జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా వేస్తే నిమిషాల్లో రిఫ్రెషింగ్ చాట్ రెడీ అవుతుంది.

దానిమ్మ ఆకులలో ఈ రోగాలను తగ్గించే గొప్ప శక్తి ఉంది.. వదిలిపెట్టొద్దు!
దానిమ్మ ఆకులలో ఈ రోగాలను తగ్గించే గొప్ప శక్తి ఉంది.. వదిలిపెట్టొద్దు!

దానిమ్మ వాల్‌నట్ సలాడ్:

ఆకుకూరల మిశ్రమంలో దానిమ్మ గింజలు, వాల్‌నట్స్, దోసకాయ ముక్కలు వేసి, కొద్దిగా ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, మిరియాల పొడితో కలుపుకుంటే ఆరోగ్యకరమైన సలాడ్ తయారవుతుంది.

దానిమ్మ ఓట్స్:

సాధారణంగా వండుకునే ఓట్స్‌పై దానిమ్మ గింజలు, వాల్‌నట్స్, దాల్చిన చెక్క పొడి వేసుకుని తింటే బేసిక్ ఓట్స్ కూడా చాలా రుచిగా మారతాయి.

దానిమ్మ సాల్సా:

దానిమ్మ గింజలతో పాటు సన్నగా తరిగిన దోసకాయ, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగును కలపాలి. చిటికెడు ఉప్పు, నిమ్మరసం పిండుకుని దీన్ని గ్రిల్ చేసిన ఆహారాలతో లేదా టోస్ట్ చేసిన బ్రెడ్‌తో తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+