దానిమ్మ ఆకులలో ఈ రోగాలను తగ్గించే గొప్ప శక్తి ఉంది.. వదిలిపెట్టొద్దు!

దానిమ్మ పండులో ఎన్నో పోషకాలు ఉంటాయని తెలుసుకున్నాం. దానిమ్మ పండులో పోషకాలతో పాటు, ఔషధ గుణాలు కూడా ఉంటాయని చెబుతారు. అలాగే దానిమ్మ పండుతో పాటు దానిమ్మ ఆకులలో కూడా ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయని అవి మన ఆరోగ్యానికి ఎంతో మంచిని చేస్తాయని చెబుతారు.

రోగాలను తగ్గించటంలో దానిమ్మ ఆకుల గొప్ప గుణాలు
మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం దగ్గర నుండి కొలెస్ట్రాల్ నిర్వహించడం వరకు ప్రతి ఒక్కదానిలో దానిమ్మ పండు పాత్ర ఏ విధంగా అయితే ఉంటుందో అనేక రోగాలను తగ్గించడంలో మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దానిమ్మ ఆకుల పాత్ర కూడా అదే విధంగా ఉంటుంది.

Pomegranate leaves have great power to reduce these diseases Don t leave it

దానిమ్మ ఆకులతో ఈ అనారోగ్యాలకు చెక్
ఆయుర్వేద వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దానిమ్మ ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. ఇక వాటి విషయానికి వస్తే దానిమ్మ ఆకులను నిత్యం తీసుకుంటే కామెర్లు, విరోచనాలు, కడుపునొప్పి ,నిద్రలేమి సమస్య తగ్గుతుంది. దానిమ్మ ఆకులు బరువును తగ్గించడంలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ గణనీయంగా ఉపయోగపడతాయి. దానిమ్మ ఆకులతో దగ్గు, జలుబు వంటి వాటిని నియంత్రించడం కూడా సాధ్యమవుతుంది.

దానిమ్మ ఆకులతో ఇలా చెయ్యండి
దానిమ్మ ఆకులను నీళ్ళల్లో వేసి మరిగించి రోజుకు రెండుసార్లు పది రోజులపాటు తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. దానిమ్మ ఆకులను పది నిమిషాలు నీటిలో మరిగించి పడుకునే ముందు ఆ నీళ్లను తాగడం వల్ల హాయిగా నిద్ర పడుతుందని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా చర్మ సమస్యలతో అలర్జీలతో బాధపడేవారు దానిమ్మ ఆకుల పేస్ట్ ను ఉపయోగిస్తే అలర్జీల నుండి ఉపశమనం దొరుకుతుంది.

దానిమ్మ ఆకులతో చర్మ ఆరోగ్యం
దానిమ్మ ఆకులను మొటిమలపై రాస్తే అది అద్భుతమైన ప్రయోజనాలను ఇచ్చి, మొటిమలను తగ్గించి మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. దానిమ్మ ఆకులలో ఉండే పోషకాలు మరియు ఖనిజాలు మన జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. మన శరీరం తగినంత శక్తిని పొందడానికి సహాయపడతాయి. దానిమ్మ ఆకులతో తయారు చేసిన టీని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

దానిమ్మ ఆకులతో క్యాన్సర్ నియంత్రణ
దానిమ్మ ఆకులు నోటి సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. చిగుళ్ల సమస్య, నోట్లో పుండ్లు, నోటి దుర్వాసన వంటి సమస్యలను తగ్గిస్తాయి. దానిమ్మ ఆకులు ప్రారంభ దశలో ఉన్న కాలేయ క్యాన్సర్ పెరుగుదలను తగ్గించడంలో ఎంతో బాగా సహాయపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దానిమ్మ ఆకులను పనికిరాని ఆకులు అని అని నిర్లక్ష్యం చేయకుండా సరైన విధానంలో ఉపయోగిస్తే ఎంతో మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+