ఎండాకాలం దోమల బారినుండి సహజ చిట్కాలతో కాపాడుకోండిలా!!

ఎండాకాలం వచ్చిందంటే చాలు దోమలు స్వైర విహారం చేస్తాయి. బయట కాసేపు కూడా కూర్చొనీయకుండా కుట్టి కుట్టి చంపుతాయి. ఇక ఈ దోమల బారి నుండి కాపాడుకోవడానికి, దోమలను నివారించడానికి చాలామంది లిక్విడ్ లను, మస్కిటో కాయిల్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటిలో ఉండే రసాయనాల వల్ల మన ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. కాబట్టి ఎటువంటి కాయిల్స్ మరియు లిక్విడ్స్ ఉపయోగించకుండా దోమలను తరిమికొట్టే అద్భుతమైన సహజ చిట్కాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ముందుగా సూర్యాస్తమయం కాగానే కిటికీలు తలుపులు మూసి ఉంచండి. దోమలు ఇంట్లోకి చేరేది అదే సమయంలో కాబట్టి, ఆ సమయంలో కిటికీలు, తలుపులు తీయకుండా జాగ్రత్త పడాలి. ఇక ఇంట్లో దోమలు ఉండకుండా చూసుకోవాలంటే ఇంట్లోని ప్రతి గది మూలను శుభ్రంగా ఉంచాలి. స్టోర్ రూమ్, వంటగది ఇలా ప్రతి గదిలోనూ ఎక్కడ దోమలు ఉండకుండా శుభ్రంగా, క్లియర్ గా పెట్టుకోవాలి. చెత్తాచెదారం ఇంట్లో లేకుండా చూసుకోవాలి. ఇక ఇంటి బయట కూడా చెత్తాచెదారం, మురుగునీరు నిలువ లేకుండా చూసుకోవాలి.

masquito

దోమలను నివారించాలంటే మంచి వాసన వచ్చే పువ్వుల మొక్కలను పెంచాలి. బంతి, తులసి, లెమన్ గ్రాస్ వంటి మొక్కలు ఇంట్లో ఉంటే దోమలు ఇంట్లోకి రావు. ఇక దోమల నివారణకు తులసి మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది . తులసిలో ఉండే అనేక ఔషధ గుణాలు, తులసి వాసన దోమలను ఇంట్లోకి రాకుండా ఆపుతాయి . తులసి రసాన్ని శరీరంపై రాసుకున్నా కూడా దోమలు కుట్టకుండా ఉంటాయి. ఇంట్లో లెమన్ గ్రాస్ మొక్కలను పెంచినా, బంతి పువ్వుతో పాటు, కొన్ని సువాసన వెదజల్లే మొక్కలను పెట్టినా దోమలు రాకుండా ఉంటాయి.

ఇక ఇంటి బయట కూర్చున్న వారు దోమల బారి నుండి కాపాడుకోవాలంటే నిమ్మకాయల మధ్య లవంగాలను గుచ్చి వారు కూర్చున్న ప్రాంతాలలో పెట్టుకుంటే దోమల బారి నుండి రక్షించబడతారు. అంతేకాదు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి లవంగాల పొడితో కలిపి ఈ రెండింటి మిశ్రమాన్ని వాటర్ బాటిల్లో నీళ్లతో కలిపి నింపి ఆ మిశ్రమాన్ని ఇంటి చుట్టూ స్ప్రే చేసినా దోమలు రాకుండా ఉంటాయి. కర్పూరం కూడా దోమలను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కిటికీలు, తలుపులు మూసివేసి ఇంట్లో కర్పూరాన్ని వెలిగించినా కర్పూరం వాసన అంతా ఇంట్లో నిండి దోమలు రాకుండా చేస్తాయి. ఈ నేచురల్ చిట్కాలను పాటించి ఎండాకాలం దోమల బారి నుండి కాపాడుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+