ఇంట్లోనే ప్రసాదం స్టైల్‌లో "పులిహోర" ఈజీగా ఎలా చేయాలంటే..?
తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన వంటకాల్లో పులిహోర కూడా ఒకటి.మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ పులిహోరను చేసుకుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో లాగా చేస్తుంటారు. సాధారణంగా ఆహారాన్ని ఆకలి తీర్చడానికి ఉపయోగించాలి. కానీ అదే ఆహారాన్ని దైవానికి సంబంధించి చూసినప్పుడు వాటి స్థానం కూడా మారిపోతుంది.
ఎవరైనా కానీ దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవుని దర్శించడమే కాకుండా అక్కడ ఇచ్చే ప్రసాదాలను సైతం స్వీకరిస్తూ ఉంటారు. కాగా ప్రసాదాలలో పులిహోరకు ప్రత్యేక స్థానం ఉంటుంది అనడంలో సందేహం అక్కర్లేదు. దేవాలయాలలో ప్రసాదంగా ఇచ్చే పులిహోర రుచి ఇంట్లో చేసినప్పుడు రాదనే భావన చాలా మందికి ఉంటుంది. అందుకే ప్రసాదం స్టైల్ లో ఇంట్లోనే పులిహోర ఎలా చేసుకోవాలో మీకోసం ప్రత్యేకంగా..

అవసరమైన పదార్థాలు..
- అర కిలో బియ్యం
- 50 గ్రాముల చింతపండు
- 15 పచ్చిమిర్చి
- రెండు చిన్న స్పూన్ల పసుపు
- 30 గ్రాముల జీడిపప్పులు
- ఆవాలు
- మెంతులు
- మిరియాలు
- జీలకర్ర
- పచ్చిశనగపప్పు
- మినప్పప్పు
- కరివేపాకు
- ఎండుమిర్చి
- ఇంగువ
- నెయ్యి
- నువ్వుల నూనె
- రాళ్ల ఉప్పు
తయారీ విధానం..
బియ్యం సిద్ధం చేయడం :
పులిహోరలో అన్నం కమ్మగా కాకుండా కొంచెం పొడిగా, గింజ గింజగా రావాలి. అందుకే కుక్కర్‌లో బియ్యం పోసి తగినంత నీరు, కొద్దిగా నూనె వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి పూర్తిగా తగ్గిన తర్వాత, అన్నాన్ని ప్లేట్‌లోకి తీసి రెండు స్పూన్ల నువ్వుల నూనె కలిపి చల్లబడేలా పక్కన పెట్టాలి. ఇలా చేస్తే అన్నం పొడిగా ఉంటుంది, పులుసుతో బాగా కలుస్తుంది.
మసాలా పొడి :
స్టవ్‌పై బాణలి పెట్టి జీలకర్ర, మెంతులు, మిరియాలు వేయించి వాసన వచ్చే వరకు దోరగా వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత మెత్తని పొడిగా దంచుకోవాలి. ఇది పులిహోరకు ప్రత్యేకమైన మసాలా బేస్. దేవాలయాల్లో ఈ మసాలాలను కొత్తగా తయారు చేస్తారు కాబట్టి రుచి కూడా తాజాగా ఉంటుంది.
చింతపండు గుజ్జు :
చింతపండును వేడి నీటిలో నానబెట్టి దానిలోని గుజ్జును తీసుకోవాలి. గుజ్జు ఎంత బాగా కాచి, చిక్కగా చేసుకుంటారో పులిహోర రుచి అంతగా ఉంటుంది. చింతపండు గుజ్జులో పులుపు సహజంగా ఉన్నా, మసాలాలతో కలిస్తే అది బాగా బ్యాలెన్స్ అవుతుంది.
పోపు తయారీ :
బాణలిలో నువ్వుల నూనె పోసి వేగిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తరువాత పచ్చిశనగపప్పు, మినపపప్పు వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. వెంటనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి తాలింపు మంచి వాసన వచ్చేలా వేయించాలి. ఈ తాలింపే పులిహోరకు అసలు సువాసనను ఇస్తుంది.
చింతపండు పులుసు తయారీ :
పోపులో చింతపండు గుజ్జు పోసి, దానితో పాటు మసాలా పొడి, రాళ్ల ఉప్పు వేసి బాగా కలుపుతూ మరిగించాలి. మద్య మంటపై పులుసు చిక్కబడే వరకు ఉడికిస్తే, పులిహోర పేస్ట్ సరిగ్గా సిద్ధమవుతుంది. ఈ పేస్ట్‌ను ఎక్కువసేపు మరిగిస్తే రుచి మరింతగా గట్టిగా వస్తుంది. దేవాలయాల్లో ఈ పులుసునే పెద్ద మొత్తంలో ముందే సిద్ధం చేసి భోగం కోసం ఉపయోగిస్తారు.
పులిహోర కలపడం :
చల్లారిన అన్నంలో మరిగించిన చింతపండు పులుసు వేయించి నెమ్మదిగా, సమానంగా కలపాలి. ప్రతి గింజకు పులిహోర పేస్ట్ పూయబడేలా కలపడంే ముఖ్యము. చివరిగా వేయించిన జీడిపప్పు, తాజా కరివేపాకు వేసి బాగా కలపాలి. కనీసం ఒక గంటపాటు మూత పెట్టి పక్కన పెట్టితే మసాలాలు పూర్తిగా అన్నంలో పూర్తిగా కలిసిపోతాయి.
ఈ పద్ధతిలో పులిహోర తయారు చేస్తే ఇంట్లో కూడా దేవాలయం నుండి తెచ్చుకున్నట్టే అదే రుచి, వాసన, ఫీల్ వస్తుంది. పండుగలు, పూజలు, శుభ సందర్భాల్లో ఈ రెసిపీ అద్భుతంగా సరిపోతుంది.
-
ఆ స్టార్ హీరో ఫేవరెట్ "బంగాళ దుంప - దోసకాయ" కర్రీ ఎలా చేయాలంటే..? -
కొవ్వుతోనే కొవ్వుకు చెక్: మన శరీరంలోని 'బ్రౌన్ ఫ్యాట్' రహస్యం.. -
పుచ్చకాయ రైస్ అసలు ఎప్పుడైనా ట్రై చేశారా..? -
eye health food: కంటి చూపును కాపాడే ఆహారాలు.. ఇప్పుడు ఇవి చాలా అవసరం! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications