గుమ్మడి గింజలతో ఆరోగ్యంలో అద్భుతమే జరుగుతుంది.. ట్రై చెయ్యండి!

ఆరోగ్యమే మహాభాగ్యమని భావిస్తున్న చాలామంది ఇటీవల కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు. ముఖ్యంగా పండ్లు, గింజలు, తృణధాన్యాలు వంటి వాటిపైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. వీటిలో ఉండే పోషకాల గురించి తెలుసుకొని వాటిని తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎక్కువమంది ఆసక్తిగా తింటున్న వాటిలో గుమ్మడికాయ గింజలు కూడా ఒకటి.

గుమ్మడి గింజలతో ఆరోగ్యం
అసలు గుమ్మడికాయ గింజలు తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మన శరీరానికి ఏ విధంగా దోహదపడుతుంది. వీటిని ఎక్కువగా ఎవరు తినకూడదు వంటి విషయాలను ప్రస్తుతం తెలుసుకుందాం. గుమ్మడికాయ గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన పోషకాలను ఇచ్చే మంచి ఆహారం. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే వీటిని అధికంగా తీసుకుంటే మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Pumpkin seeds can do wonders for your health Try them

గుమ్మడి గింజలను ఇలా తినండి
కనుక వీటిని మితంగా తీసుకోవడం మంచిది. ఇక గుమ్మడి గింజలను నేరుగా స్నాక్స్ గా తినవచ్చు. సలాడ్లలో కూడా వీటిని కలుపుకొని తీసుకోవచ్చు. ఇక సూప్ లలో కూడా గుమ్మడి గింజలు వేసుకొని తినవచ్చు. స్మూతీస్ లో కూడా గుమ్మడి గింజలను తీసుకోవచ్చు. గుమ్మడి గింజలను రోజు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుమ్మడి గింజల్లో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

గుమ్మడి గింజలలో సంవృద్దిగా ఉండే పోషకాలు ఇవే
గుమ్మడి గింజలలో మోనో అన్ శాచ్యురేటెడ్, పాలి అన్ శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ కే, విటమిన్ ఈ, విటమిన్ బి కాంప్లెక్స్ గుమ్మడి గింజలలో లభిస్తాయి. మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, కాపర్ వంటి ఖనిజాలు గుమ్మడి గింజల్లో సమృద్ధిగా ఉంటాయి. గుమ్మడి గింజలు శరీరాన్ని ఆక్సికరణ ఒత్తిడి నుంచి రక్షించే యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి.

బరువు తగ్గటమే కాదు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఇక ఇన్ని పోషకాలు ఉన్న గుమ్మడి గింజలను మనం ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుమ్మడి గింజల్లో ఉండే జింక్, మెగ్నీషియం మెదడు ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. గుమ్మడి గింజల్లోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మెలటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది మంచి నిద్రకు ఉపకరిస్తుంది.

వీరు గుమ్మడి గింజలను తినొద్దు
గుమ్మడి గింజలు ఎక్కువ సేపు మన ఆకలిని తీర్చడానికి దోహదం చేస్తాయి. మన బరువును నియంత్రించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే గుమ్మడి గింజలను అలర్జీలు ఉన్నవారు, బీపీ ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు, కొన్ని రకాల మందులు వాడేవారు తీసుకోకూడదు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+