అందుకే వేసవిలో ఈ జావ తాగాల్సిందే, సమస్యలన్నీ పరార్..!!
వేసవి తీవ్రత పెరుగుతోంది. ఈ కాలంలో ఎక్కువగా ఆహారం తినాలనిపించదు. వేసవిలో ఉదయం తీసుకునే ఆహారం రోజంతా మనం హుషారుగా పనిచేయడానికి కావాల్సిన శక్తినిచ్చేలా ఉండాలి. వేసవిలో శరీరానికి కావాల్సిన శక్తిని అందించే అద్భుత పానీయం రాగి జావ. ప్రాచుర్యం పొందిన పోషక పదార్థం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించటం లో సహకరిస్తుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే, ఈ రాగి జావ ఎంత మంచిదో... అతిగా తీసుకుంటే సమస్యలు ఉన్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఉదయం వేళ ఖాళీ కడుపుతో తీసుకుంటే మరింత శక్తివంతగా పని చేస్తుంది. అదే విధంగా జీర్ణ వ్యవస్థ పని తీరు ను మెరుగు పరుస్తుంది. కడుపులో సహజంగా వచ్చే సమస్యల నియంత్రణలో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా కడుపు నిండుగా ఉండటంతో పాటుగా బరువు తగ్గించటంలోనూ సహాయ కారిగా నిలుస్తుంది. రాగిజావ సహజ సిద్దంగా శరీరానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం.. పోషకాలు ఎంత గానో ఉపకరిస్తాయి. చర్మానికి కావాల్సిన తేమను అందించి..ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరి స్తుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఈ జావ మేలు చేస్తుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ మోతాదు తక్కువగా ఉంటుంది. దీని కారణంగా చెక్కెర స్థాయి నియంత్రణలో ఉంచుతూ.. శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉదయం వేళలో తీసుకోవటం ద్వారా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే.. ఎముకలకు బలాన్నిస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్ కణాల పునరుద్దరణకు సహకరిస్తుంది. ఇక, ఇదే సమయంలో రాగిజావ కు ప్రతీ రోజు ఒక సమయం కేటాయించి.. ఆ టైమ్ లో తీసుకోవటం ద్వారా ఆరోగ్య పరంగా ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

వేసవిల ోరాగిజావతో ప్రయోజనాలు
రాగిజావ వినియోగంలోనూ కొన్ని సూచనలు చేస్తున్నారు. రాగి జావ ఉదయం వేళ తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. రాత్రి సమయంలో కొందరికి ఇబ్బందులకు కారణం అవుతుందని చెబుతున్నారు. అదే విధంగా మూత్రాయశయ సమస్యలు... కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు రాగిజావ తీసుకోకపోవటం మంచిదని సూచిస్తున్నారు. బరువు పెరగాలనుకొనే వారికి రాగిజావ వలన ప్రయోజనం ఉండదు. అదే విధంగా మోతాదు మేరకు వినియోగిస్తే సమస్యల ఉండవని.. అంతకు మించి తీసుకుంటే కడుపులో ఉబ్బరం తో పాటుగా డయేరియాకు అవకాశం ఉంటుందని అలర్ట్ చేస్తున్నారు. థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు వైద్యుల సూచనల మేరకే రాగిజావను తీసుకోవటం మంచిది. ప్రస్తుతం ఇన్ స్టంట్ గా వస్తున్న రాగిజావ కంటే ఇంట్లో తయారు చేసుకునే రాగిజావ ఆరోగ్య రీత్యా మంచిది. సహజసిద్ధమైన డ్రింక్ గా భావించే రాగిజావ వలన ఎన్నో ప్రయోజాలు ఉన్నా.. వినియోగంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు.
-
ఎండాకాలం చన్నీళ్ళ స్నానం చేస్తున్నారా? -
"మిల్ మేకర్ బ్రెడ్ ఆమ్లెట్" ఇలా చేస్తే ముక్క కూడా వదలరు !! -
దయచేసి నడవండి.. రోజుకు 7000 అడుగులేయండి.. -
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
టీలో చక్కెరకు బదులు ఇవి వాడి చూడండి: అస్సలు వదలరు -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ













Click it and Unblock the Notifications