రాగిజావ రెగ్యులర్ గా తాగుతున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!
రాగిజావ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి పోషకాలను కలిగి ఉంటుంది. విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్‌లు, కొవ్వులు, ప్రొటీన్‌ల వంటి అన్ని అవసరమైన స్థూల పోషకాలను కలిగి ఉంటుంది. ప్రతిరోజూ రాగిజావను తీసుకోవచ్చు. అయితే దీనికంటూ ఓ టైమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఎప్పుడుపడితే అప్పుడు తాగటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
అయితే, ఈ రాగి జావ ఎంత మంచిదో... అతిగా తీసుకుంటే సమస్యలు ఉన్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
రాగిజావ సహజ సిద్దంగా శరీరానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే కాల్షింయ.. పోషకాలు ఎంత గానో ఉపకరిస్తాయి. చర్మానికి కావాల్సిన తేమను అందించి..ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరి స్తుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఈ జావ మేలు చేస్తుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ మోతాదు తక్కువగా ఉంటుంది. దీని కారణంగా చెక్కెర స్థాయి నియంత్రణలో ఉంచుతూ.. శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉదయం వేళలో తీసుకోవటం ద్వారా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే.. ఎముకలకు బలాన్నిస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్ కణాల పునరుద్దరణకు సహకరిస్తుంది. ఇక, ఇదే సమయంలో రాగిజావ కు ప్రతీ రోజు ఒక సమయం కేటాయించి.. ఆ టైమ్ లో తీసుకోవటం ద్వారా ఆరోగ్య పరంగా ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

రాగిజావ వినియోగంలోనూ కొన్ని సూచనలు చేస్తున్నారు. రాగి జావ ఉదయం వేళ తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. రాత్రి సమయంలో కొందరికి ఇబ్బందులకు కారణం అవుతుందని చెబుతున్నారు. అదే విధంగా మూత్రాయశయ సమస్యలు... కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు రాగిజావ తీసుకోకపోవటం మంచిదని సూచిస్తున్నారు. బరువు పెరగాలనుకొనే వారికి రాగిజావ వలన ప్రయోజనం ఉండదు. అదే విధంగా మోతాదు మేరకు వినియోగిస్తే సమస్యల ఉండవని.. అంతకు మించి తీసుకుంటే కడుపులో ఉబ్బరం తో పాటుగా డయేరియాకు అవకాశం ఉంటుందని అలర్ట్ చేస్తున్నారు. థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు వైద్యుల సూచనల మేరకే రాగిజావను తీసుకోవటం మంచిది. ప్రస్తుతం ఇన్ స్టంట్ గా వస్తున్న రాగిజావ కంటే ఇంట్లో తయారు చేసుకునే రాగిజావ ఆరోగ్య రీత్యా మంచిది. సహజసిద్ధమైన డ్రింక్ గా భావించే రాగిజావ వలన ఎన్నో ప్రయోజాలు ఉన్నా.. వినియోగంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications