రాఖీ స్పెషల్ రవ్వ కేసరి.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా.. ఇలా ట్రై చెయ్యండి!

రాఖీ పండుగ వచ్చేసింది. సోదర బంధానికి అర్ధం చెప్పే రాఖీ పండుగను సంతోషాల నడుమ అందరూ జరుపుకుంటారు. అటువంటి రాఖీ పండుగ నాడు రవ్వ కేసరిని చేసి ఇంటిల్లపాదీ ఆస్వాదిస్తే బాగుంటుంది. రవ్వ కేసరి దక్షిణ భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ తీపి వంటకం. పండుగలు, శుభకార్యాలు, దేవునికి నైవేద్యం పెట్టడానికి ఎక్కువగా తయారుచేస్తారు. నోట్లో వేస్తే కరిగిపోయేలా సాఫ్ట్‌గా, రుచిగా ఉండే ఈ స్వీట్‌ను కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు

బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) - 1 కప్పు
పంచదార - 1½ నుంచి 2 కప్పులు (మీరు ఇష్టపడే తీపి స్థాయికి అనుగుణంగా)
నీళ్లు - 3 కప్పులు
నెయ్యి - అర కప్పు
జీడిపప్పు, కిస్మిస్ - తగినంత
ఏలకుల పొడి - అర టీస్పూన్
కుంకుమపువ్వు - చిటికెడు (ఐచ్ఛికం)

Ravva Kesari Know how to make perfect soft Ravva Kesari at home Simple ingredients step-by-step method

తయారీ విధానం:

ముందుగా పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. అదే పాన్‌లో మిగిలిన నెయ్యి కొంత వేసి రవ్వను వేయండి. మంటను తగ్గించి రవ్వ నుంచి మంచి సువాసన వచ్చే వరకు నెమ్మదిగా వేయించండి. రవ్వ రంగు మారకుండా జాగ్రత్తపడాలి. వేయించిన రవ్వను ప్లేట్‌లోకి తీసి పెట్టండి.

రవ్వ కేసరి ఇలా చెయ్యాలి

ఇప్పుడు అదే పాన్‌లో మూడు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించండి. నీళ్లు మరుగుతున్నప్పుడు కేసరి రంగు లేదా పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు వేయండి. మంటను పూర్తిగా తగ్గించి వేయించిన రవ్వను కొద్దికొద్దిగా వేస్తూ గరిటెతో వేగంగా కలపండి. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుతూ రవ్వ నీళ్లు పీల్చుకుని దగ్గరపడే వరకు ఉడికించండి.

నెయ్యి కేసరి నుంచి వేరుపడుతున్నట్లు ఉంటే కేసరి రెడీ అయినట్టే

రవ్వ బాగా ఉడికిన తర్వాతే పంచదార వేయాలి. చక్కెర వేసిన వెంటనే మిశ్రమం కాస్త పల్చబడుతుంది. చక్కెర పూర్తిగా కరిగి కేసరి చిక్కబడే వరకు కలుపుతూ ఉండండి. చివర్లో మిగిలిన నెయ్యి, ఏలకుల పొడి వేసి బాగా కలపండి. నెయ్యి కేసరి నుంచి వేరుపడుతున్నట్లు కనిపించినప్పుడు స్టవ్ ఆపేయండి. ముందుగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపితే రుచికరమైన రవ్వ కేసరి సిద్ధం.

దోసకాయ టమాటో ఇన్‌స్టంట్ నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే అదుర్స్!
దోసకాయ టమాటో ఇన్‌స్టంట్ నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే అదుర్స్!

సాఫ్ట్ కేసరి కోసం ముఖ్యమైన చిట్కాలు

ఒక కప్పు రవ్వకు మూడు కప్పుల నీళ్లు వాడితే చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా మెత్తగా ఉంటుంది. రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాతే చక్కెర వేయాలి, లేకపోతే రవ్వ సరిగా ఉడకదు. నెయ్యి కొద్దిగా ఎక్కువగా వేస్తే కేసరి మెరిసి, నోట్లో కరిగిపోయేలా ఉంటుంది. ఈ సింపుల్ రెసిపీతో ఈ రాఖీ పండుగ సంతోషంగా జరుపుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+