పచ్చి బొప్పాయితో ఆరోగ్యంలో అద్భుతాలు జరుగుతాయ్.. ట్రై చెయ్యండి

మనకు శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో బొప్పాయి ఒకటి. బొప్పాయిని పండుగా మాత్రమే కాదు పచ్చి బొప్పాయిని తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి బొప్పాయిని కూర వండుకొని తింటే దానిలో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. పచ్చి బొప్పాయిలో పపైన్ అనే శక్తివంతమైన దీర్ఘ ఎంజైమ్ ఉంటుంది. ఇది మన కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది.

పచ్చి బొప్పాయితో బరువుకు చెక్
మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంచడంలో ఎంతగానో దోహదం చేస్తుంది. పచ్చి బొప్పాయి లో ఉండే పోషకాలతోటి శరీర బరువు తగ్గే అవకాశం ఉంటుంది. పచ్చి బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కారణంగా ఇది తినడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. బొప్పాయి ఆకలిని నియంత్రిస్తుంది. దీని వల్ల శరీర బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

Raw papaya can do wonders for your health try it

పచ్చి బొప్పాయిలో ఫుల్ పోషకాలు
పచ్చి బొప్పాయి లో బీటా కేరోటిన్లు, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల పచ్చి బొప్పాయి తింటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పచ్చి బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మన శరీరానికి పోరాడే శక్తిని ఇస్తుంది. పచ్చి బొప్పాయి లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ అధికంగా ఉంటాయి. ఇవి న్యాచురల్ గా మన శరీరంలోని వ్యర్ధాలను డిటాక్సిఫై చేస్తాయి.

పచ్చి బొప్పాయితో డయాబెటిస్ కంట్రోల్
దీనివల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మొటిమలు తగ్గుతాయి. పచ్చి బొప్పాయి లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. పచ్చి బొప్పాయి లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పచ్చి బొప్పాయి లో విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు బీటా కెరోటిన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇంఫ్లేషన్ ను తగ్గిస్తాయి.

పచ్చి బొప్పాయిలో లివర్ క్లీన్
పచ్చి బొప్పాయిలో కాలేయాన్ని శుభ్రపరిచే గుణాలు మెండుగా ఉంటాయి. పచ్చి బొప్పాయి కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే పచ్చి బొప్పాయిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+