ఎర్ర బియ్యం తినండి.. డాక్టర్ తో పనుండదు!
బియ్యం అనగానే సాధారణంగా ఎవరికైనా తెల్లవే గుర్తుకు వస్తాయి. తెల్ల బియ్యంతో వండిన అన్నాన్ని ఏ కూర కలుపుకొని తిన్నా రుచిగానే ఉంటుంది. అయితే ఈ బియ్యంతో వండిన అన్నంలో స్టార్చ్, కార్భోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి అంత మంచివి కావు. అందుకే తెల్ల అన్నాన్ని తక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే బియ్యంలో ఒక్క తెల్ల బియ్యమే కాదు.. అనేకరకాల రంగుల్లో బియ్యం ఉన్నాయి. కొన్నింటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటి విషయాల గురించి తెలుసుకుందాం.
ప్రధానంగా రెడ్ రైస్.. పూర్వీకులు బాగా తినేవారు. అందుకే వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఎప్పుడైతే తెల్ల బియ్యం తినడం ప్రారంభించారో అప్పటి నుంచి అంతా అనారోగ్యమే. ఎర్ర బియ్యంతో వండుకొని తినడంవల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ బియ్యంలో సెలీనియం, బీటాకెరోటిన్, విటమిన్ సి వంటివి ఉంటాయి. ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఎర్ర బియ్యాన్ని తినడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగరు వల్ల శరీర ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

ఎర్రబియ్యం అన్నం తినడంవల్ల బరువు పెరగరు. కొవ్వు కూడా పేరుకుపోదు. వీటిలో కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉంచేందుకు ఇవి తోడ్పడతాయి. చర్మ సమస్యలు, జట్టు సమస్యలు తగ్గుముఖం పడతాయి. దీన్నివల్ల అన్నీ ప్రయోజనాలేనని, రోజుకు ఒక కప్పు ఎర్ర బియ్యంతో వండి అన్నం తినాలని వైద్యులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications