రెడ్ వైన్ తాగడంవల్ల ఎన్నో ప్రయోజనాలు?
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతుంటారు. కానీ మద్యం తాగడం వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయని పలు పరిశోధనలు తేలుస్తున్నాయి. ప్రధానంగా చర్మానికి సంబంధించిన ఆరోగ్యం మెరుగవుతుందని తేలుతోంది. మితంగా వైన్ తాగడం వల్ల గుండె జబ్బుల నుంచి ఎముకల వరకు.. అనేక ప్రయోజనాలు ఉంటాయని పరిశోధనలు నిరూపించాయి
రెడ్‌వైన్‌లో ఉండే ప్రత్యేక గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచి వృద్ధ్యాప్య ఛాయలను దూరం చేస్తాయి. అలాగే చర్మ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా మారుతుందని పరిశోధనలో తేలింది. అంతేకాదు.. జ్ఞాపక శక్తిని కూడా మెరుగు పరుస్తుంది. మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. అనేక అధ్యయనాల్లో కూడా ఈ విషయం వెల్లడైంది.

వైన్ లోని సమ్మేళనాడు రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదించేలా చేస్తాయి. వీటిల్లో ఉండే ఫినాల్స్ ప్రొస్టేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయి. నోటి క్యాన్సర్ ను నయం చేయడంలో కూడా తోడ్పడుతుంది. రెడ్ వైన్ ను మితంగా తీసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఒక గ్లాసు వైన్ ఇన్ఫ్లమేషన్స్, టాక్సిన్స్ తో పోరాడటంద్వారా మనసుకు విశ్రాంతినిస్తుంది. బోలు ఎముకల వ్యాధిని తగ్గిస్తుంది.
మంచిది కదా అని అదే పనిగా తీసుకోకూడదు. రోజుకు ఒక గ్లాసు మాత్రమే తీసుకోవాలి. మితంగా ఉపయోగించినప్పుడే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. మోతాదు మించితే నష్టం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా తాగడం వల్ల ప్రమాదాలు, పక్షవాతం, గుండె ఆగిపోవడం, కాలేయ వ్యాధులు, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు ఎదురవుతాయి.












Click it and Unblock the Notifications