బీర్ vs వైన్‌- ఏ వయసు వారికి ఏది మంచిది..!!

మ‌ద్యం ప్రియులు త‌మ‌కు ఇష్ట‌మైన మ‌ద్యాన్ని సేవిస్తారు. మద్యం ప‌రిమిత మోతాదులో సేవిస్తే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌నే అభిప్రాయం ఉంది. సైంటిస్టులు సైతం త‌మ అధ్య‌య‌నా ల ద్వారా ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే చెబుతుంటారు. అయితే మ‌ద్యంలో బీర్‌, వైన్‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది సేవిస్తున్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంద‌ని మ‌ద్యం ప్రియులు అన్వేషిస్తున్నారు. కాగా, రెండిటిలో ఏది ఎవరికి మేలు చేస్తుందీ.. ఎవరికి నష్టం చేస్తుందనే అంశం పైన నిపుణులు స్ఫష్టత ఇస్తున్నారు.

మద్యం లో యువత ఎక్కువగా బీర్లను ఇష్టపడుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అదే విధంగా ఈ మధ్య కాలంలో వైన్స్ సేల్స్ భారీగా పెరుగుతున్నాయి. దీంతో.. ఈ రెండింటి లో ఏది ప్రయోజనం అనే చర్చ మొదలైంది. వైన్‌లో రెండు ర‌కాల వైన్స్ ఉంటాయి. ఒక‌టి వైట్ వైన్‌, రెండోది రెడ్ వైన్‌. రెడ్ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో రెస్వెరెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండెను సంర‌క్షిస్తుంది. మ‌న శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌)ను త‌గ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌)ను పెంచు తుంది. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం వైన్‌ను మోతాదులో తాగితే గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని చెబుతున్నారు. అదే విధంగా బీర్ విష‌యానికి వ‌స్తే దీంట్లో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయనే అభిప్రాయం ఉంది.

red-wine-particularly-when-drunk-with-a-meal-offers-more-cardiovascular-benefits-than-beer

అయితే ఎముక‌ల ఆరోగ్యం విష‌యానికి వ‌స్తే బీర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. బీర్‌లో సిలికాన్ అధికంగా ఉంటుంది. ఇది ఎముక‌ల సాంద్ర‌త‌ను పెంచి ఎముక‌లు బ‌లంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీంతో వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక‌ల వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ఇక వైన్‌లో సిలికాన్ ఉండ‌దు. క‌నుక ఎముక‌ల ఆరోగ్యం కావాల‌నుకునే వారు బీర్ తాగితే మంచిదనే వాదన ఉంది. బీర్‌లో ప్రీ బ‌యోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. వైన్‌లో టానిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తాయి. జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యానికి వ‌స్తే బీర్‌, వైన్ రెండూ ముఖ్య పాత్ర పోషిస్తాయి. మెద‌డు ఆరోగ్యం విష‌యానికి వ‌స్తే వైన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెద‌డును యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే మ‌తిమ‌రుపు వంటి వ్యాధులు రాకుండా వైన్ కాపాడుతుందనే వాదన ఉంది. బీర్ క‌న్నా వైన్ అందించే లాభాలే ఎక్కువ‌గా ఉంటాయి. అయినా.. మోతాదులో మాత్ర‌మే సేవించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+