ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటున్నారా..?

ఆహారాన్ని వేస్ట్ చేయడం చాలా మందికి ఇష్టం ఉండదు. అలాగే మరికొంత మంది సమయం లేకపోవడం కారణంగా ఉదయం వండుకుని రాత్రి వరకు దాన్ని పదే పదే వేడి చేసుకుని తింటుంటారు. ఆహారాన్ని వేడి చేయడం కోసం ఓవెన్‌ లో లేదా గ్యాస్‌ ను ఉపయోగిస్తారు. అయితే ఇలా ఆహారాన్ని పదే పదే వేడిచేసి తినడం ద్వారా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఇంటి ఆహారమైనా ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని చెబుతున్నారు.

మారుతున్న జీవనశైలి, ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది ఇళ్లల్లో రెండు, మూడు రోజులకు సరిపడా వండుకుని ఫ్రిజ్​లో పెట్టుకోవడం అలవాటుగా మారిపోయింది. అవసరమైనప్పుడు వాటిని బయటకు తీసి వేడి చేసుకుని తింటున్నారు. అయితే ఇలా చేయడం ద్వారా అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలా నిల్వ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి తినడం సురక్షితం కాదని హెచ్చరిస్తున్నారు.

ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల పోషకాలు తక్కువ అవ్వడంతోపాటుగా విషపూరితంగా మారుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేయడమే కాకుండా.. శరీరంలో విషపూరిత అంశాలు పేరుకుపోవడం ద్వారా తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుందని వివరిస్తున్నారు. ఇక WHO ప్రకారం వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసేటప్పుడు.. దాని ఉష్ణోగ్రత కనీసం 70 డిగ్రీల సెల్సియస్‌ కు చేరుకోవాలి. అప్పుడు మాత్రమే బ్యాక్టీరియా చనిపోతుంది. కానీ ఈ ప్రక్రియ ఒక్కసారి మాత్రమే చేయాలని చెబుతోంది.

Reheat Regret Experts Warn Repeatedly Heating Food Can Harm Your Health

అన్నంను తరచుగా వేడి చేస్తే.. ఇందులో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుందని, చల్లారిన అన్నాన్ని తిరిగి వేడి చేస్తే.. ఈ బ్యాక్టీరియా మరింత పెరిగి, విషపదార్థాలను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. దీని వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+