బియ్యంతో బోలెడు ప్రయోజనాలు... ఇలా కూడా వాడొచ్చు!

మనం బియ్యాన్ని నిత్యం ఉపయోగిస్తూ ఉంటాం. బియ్యంతో అన్నం వండుకోవడం మాత్రమే కాకుండా, పిండి వంటలు కూడా చేస్తూ ఉంటాం. అయితే బియ్యంతో ఇంకా ఏం చేయొచ్చు? బియ్యాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు? ఇది మనకు ఎటువంటి ప్రయోజనాలను చేకూరుస్తుంది? వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

బియ్యంతో ఈ ప్రయోజనాలు
బియ్యం మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. బియ్యాన్ని పిండి చేసి ఆ బియ్యం పిండిలో కొంచెం పాలు, తేనె కలిపి ముఖానికి అప్లై చేస్తే స్కిన్ టైటనింగ్ అవుతుంది. రిఫ్రిజిరేటర్లు, కిచెన్ కప్ బోర్డులు అప్పుడప్పుడు దుర్వాసన వెదజల్లుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఒక చిన్న గిన్నెలో బియ్యాన్ని పోసి ఆ బియ్యం గిన్నెను కప్ బోర్డ్ లు, ఫ్రిజ్ లలో ఒక మూలన పెడితే ఆ వాసనను బియ్యం పీల్చేసుకుంటుంది.

Rice has many benefits You can also use raw rice in many ways

బియ్యంతో ఇలా కూడా చెయ్యొచ్చు
సాధారణంగా మనం డబ్బాలలో నిలువ ఉంచే ఉప్పుకి తడి తగిలితే గట్టిపడుతుంది. గడ్డలుగా మారుతుంది. అలాంటప్పుడు ఉప్పులో కొన్ని బియ్యం గింజలు వేస్తే ఉప్పు గడ్డలు కట్టకుండా ఉంటుంది. అందులో ఉన్న తేమదనాన్ని బియ్యం లాగేస్తుంది.మన మొబైల్ ఫోన్లు, రిమోట్ వంటివి అప్పుడప్పుడు చేతిలోనుంచి జారిపోయి పొరపాటున నీళ్లలో పడుతూ ఉంటాయి. అటువంటి వాటిని బియ్యంలో కప్పి రెండు గంటల పాటు ఉంచితే బియ్యం వాటిలో ఉండే తడిని బియ్యం పీల్చేస్తుంది.

బియ్యం మాత్రమే కాదు బియ్యం కడిగిన నీళ్ళు ఉపయోగకరమే
చాలామంది సీతాఫలాలు, మామిడి వంటి పండ్లు త్వరగా పక్వానికి రావడానికి బియ్యం నిల్వచేసే డబ్బాలలో బియ్యంతో కప్పి ఉంచుతారు. అప్పుడు అవి సహజంగా త్వరగా పక్వానికి వస్తాయి. ఇక బియ్యం కడిగిన నీళ్లను కూరగాయలు, పండ్లు శుభ్రం చేయడానికి వాడవచ్చు. బియ్యం కడిగిన నీళ్లలో పండ్లను, కూరగాయలను 15 నిమిషాల పాటు ఉంచి శుభ్రం చేస్తే, పంట పొలాలలో ఉన్నప్పుడు వాటిపై పిచికారీ చేసిన పురుగుమందుల ప్రభావం పూర్తిగా పోతుంది.

బియ్యం కడిగిన నీళ్ళలో బోలెడు పోషకాలు
బియ్యం కడిగిన నీళ్లు, ముఖానికి, జుట్టుకి, పాదాలకు, గోళ్ళ సంరక్షణకు వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. బియ్యం కడిగిన నీటిని మొక్కలకు పోస్తే అందులో ఉండే పోషకాలు మొక్కలను చీడపీడల నుంచి, తెగుళ్ల నుంచి రక్షిస్తాయి. ఇలా బియ్యం మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+