diabetic neuropathy: కాళ్ళలో తిమ్మిర్లు, మంటలా? డయాబెటిక్ న్యూరోపతి కావచ్చు.. తెలుసుకోండి!!

డయాబెటిస్.. మన శరీరంలోని అనేక అవయవాలపై ప్రభావం చూపించే అతిపెద్ద దీర్ఘ రోగం. డయాబెటిస్ రావటం అంటే చెట్టుకు చెదలు పట్టినట్టే అంటారు చాలా మంది. అందుకే డయాబెటిస్ ను ఎప్పుడూ కంట్రోల్లో పెట్టుకోవాలి. డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోతే అనేక అనర్ధాలు జరుగుతాయి. శరీరంలోని అనేక అవయవాలు దెబ్బ తింటాయి.

ముఖ్యంగా డయాబెటిస్ కంట్రోల్ లేనివారికి డయాబెటిస్ న్యూరోపతి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి డయాబెటిస్ న్యూరోపతి రాకుండా ఉండటం కోసం మధుమేహాన్ని అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది. అసలీ డయాబెటిస్ న్యూరోపతి లక్షణాలు ఏమిటి? దీనిని ఎలా గుర్తించాలి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

diabeticneuropathy

డయాబెటిస్ న్యూరోపతి వచ్చినవారికి కాళ్లు, చేతుల నరాలు దెబ్బతింటాయి. పాదాలలో చాలా అసౌకర్యం గానూ, జలదరింపుగానూ ఉంటుంది. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి. నడిచే సమయంలో కాస్త తడబడుతూ నడిచే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి తూలుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది. డయాబెటిస్ న్యూరోపతి వచ్చినవారికి గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ తో పాటు జననేంద్రియాలపైన కూడా తీవ్రమైన ప్రభావం ఉంటుంది.

ఇక రాత్రి వేళ పాదాలలో విపరీతమైన మంట ఉంటుంది. పాదాలపై చల్లని నీళ్లు పోసుకుంటే బావుండు అన్న భావన కలుగుతుంది పాదాలు మంటలు, నొప్పులతో సరిగ్గా నిద్ర పట్టదు. డయాబెటిస్ న్యూరోపతి వచ్చినవారికి ఏది తిన్న వికారంగా వాంతి చేసుకోవాలని అనిపిస్తుంది. అంతేకాదు కొందరికైతే విరోచనాలు కూడా అయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు డయాబెటిక్ న్యూరోపతి వల్ల మలబద్ధకం కూడా ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తుంది.

డయాబెటిక్ న్యూరోపతితో విపరీతంగా చెమటలు పట్టడం, గుండెదడగా అనిపించడం, హృదయ స్పందన పెరిగినట్టుగా ఫీల్ కావడం జరుగుతుంది. కండరాలు బలహీనంగా ఉన్నట్లు అనిపించటం జరుగుతుంది. కళ్లు తిరిగినట్లుగా అనిపిస్తుంది. డయాబెటిక్ న్యూరోపతి వల్ల మహిళలలో శృంగార కాంక్ష తగ్గుతుంది. జననేంద్రియాలలో అనేక ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. యోని పొడిగా ఉండి భార్య భర్తల సంభోగం ఇబ్బందికరంగా ఉంటుంది. మూత్రాశయ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+