చీర బిగుతుగా కట్టుకునే మహిళలకు షాకింగ్ న్యూస్!
భారతీయ మహిళలు అత్యంత ఇష్టంగా ధరించే వస్త్రాలలో చీరది అగ్రస్థానం. ఇక మహిళలు చీరలు కొనుగోలు చేయడానికి, చీరలు కట్టుకోవడానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. అటు పట్టణాలైనా, గ్రామీణ ప్రాంతాలైనా చీర కట్టు పైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఇక ఇటీవల కాలంలో శారీ డ్రేపింగ్ కూడా ఒక కోర్స్ లాగా తయారయింది. ఇక ఇదే సమయంలో చీర కట్టుకోవడం పట్ల మహిళలకు ఆందోళన కలిగే విషయాన్ని వెల్లడించారు ప్రముఖ ఆంకాలజిస్టులు.
మహిళల చీరకట్టు.. ఆరోగ్యంపై అధ్యయనం
2023లో ముంబైలోని ఆర్ ఎన్ కూపర్ హాస్పిటల్ లో జరిగిన ఒక అధ్యయనంలో చీర బిగుతుగా కట్టుకోవడం వల్ల మహిళలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరైతే బిగుతుగా బట్టలు ధరిస్తారో వారిని అధ్యయనం చేసిన ఆంకాలజిస్టులు 200 మంది మహిళలను అధ్యయనం చేయగా వారిలో వందమంది ఎస్సిసి తో బాధపడుతున్నారని తేల్చారు.

చీర బిగుతుగా కట్టుకుంటే క్యాన్సర్ ముప్పు
చీరలు బిగుతుగా కట్టుకోవడం వల్ల వారు క్యాన్సర్ బారిన పడ్డారని గుర్తించారు. చీర బిగుతుగా కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. చీర బిగుతుగా కట్టుకోవడం వల్ల వచ్చే క్యాన్సర్ చాలా అరుదైన స్కిన్ క్యాన్సర్ అని ఇది నడుము దగ్గర వస్తుందని చెబుతున్నారు.
స్కిన్ క్యాన్సర్ ఇలా మొదలు
చీర కట్టుకునే ముందు లోపల లంగా కట్టుకుని ఆ పైన చీర కట్టుకుంటారు. అయితే లంగా బందుతో గట్టిగా చుట్టి కట్టుకోవడం వల్ల కొన్ని ఏళ్ల తర్వాత ఆ భాగంలో చర్మం నల్లగా మారి ఊడిపోతుంది. అక్కడ దురద కూడా మొదలవుతుంది. ఇక ఈ లక్షణాలను పట్టించుకోకపోతే అది స్కిన్ కాన్సర్ గా మారే అవకాశం ఉందని ఆంకాలజిస్ట్ లు చెబుతున్నారు.
స్క్వామస్ సెల్ కార్సినోమా
ఒక్క చీర విషయంలోనే కాదు ఎవరైతే బిగుతుగా ఉండే బట్టలు ధరిస్తారో వారిలోనూ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్యాన్సర్ ను వైద్య పరిభాషలో స్క్వామస్ సెల్ కార్సినోమా అంటారని చెబుతున్నారు. ఈ క్యాన్సర్ వ్యాప్తికి ముఖ్యంగా అపరిశుభ్రంగా ఉండటమే కారణమని హెచ్చరిస్తున్నారు.
బిగుతుగా చీర కడితే డేంజర్
స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది స్క్వామస్ కణాలలో ఏర్పడే ఒక రకమైన క్యాన్సర్ అని అత్యంత సాధారణంగా వచ్చే చర్మ క్యాన్సర్లలో ఇది ఒకటి అని చెబుతున్నారు. సూర్య రస్మికి ఎక్కువగా గురి అయ్యే వారిలోనూ, నడుం చుట్టూ బిగుతుగా ఉండే దుస్తులు ధరించే వారిలోనూ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications