లివర్ ఆరోగ్యాన్ని పెంచే బెస్ట్ డ్రింక్స్..టాక్సిన్లు క్లీన్..!!
కాలేయం శరీరంలో కీలకమైన భాగం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా లివర్ ఆరోగ్యంగా ఉండాలి. కానీ, మద్యపానం, మారిన ఆహారపు అలవాట్ల వల్ల కాలేయంలో అనేక సమస్యలు వస్తు న్నాయి. ముఖ్యంగా ట్యాక్సిన్స్ పేరుకుపోయి కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు, మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలేయానికి ఎప్పటికప్పుడు శక్తిని అందిస్తూ శుభ్రం చేయటానికి మన ఇంట్లోనే బెస్ట్ డ్రింక్స్ ఉన్నాయి. వీటి ద్వారా లివర్ ను పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉంచుకొనే అవకాశం ఉంటుంది.
కాలేయం మన రక్తం నుండి విషాన్ని, వ్యర్థాలను తొలగించి ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచు తుంది. కాలేయ ఆరోగ్యానికి బీట్‌రూట్ రసం సహాయపడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సి డెంట్లు, బీటాలైన్స్ కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుండి రక్షిస్తాయి, అలాగే నైట్రేట్స్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి. బీట్‌రూట్ రసం దానిలోని పోషక విలువలు, కొవ్వు తగ్గించే లక్షణాల వల్ల కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫ్యాటీ లివర్ వ్యాధికి కాఫీ సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మితంగా కాఫీ తాగడం వల్ల ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. గ్రీన్ టీ కాలేయానికి మేలు చేస్తుంది, ఎందుకంటే దీనిలోని యాంటీఆక్సిడెంట్లు కొవ్వు పేరుకుపోవడాన్ని, మంటను తగ్గించడంలో సహాయపడతాయి. గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.

అదే విధంగా అల్లంలో ఉండే శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా అల్లం టీ సేవించడం ద్వారా కాలేయంలో పేరుకు పోయిన కొవ్వును కరిగించే ప్రక్రియ వేగవంతమవుతుంది. రోజు ఒకసారి అల్పాహారానికి ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక.. అదే విధంగా ఉసిరి లో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది కాలేయ కణాల పనితీరును మెరుగుపరచడంలో దోహదపడుతుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి రసం తీసుకుంటే కాలేయాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఉపయో గపడుతుంది. వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగడం వల్ల కాలేయ కణాల పునరుత్పత్తి వేగంగా జరుగుతుంది. ఇది శరీరాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రకు ముందు ఇది తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది. అయితే, లివర్ కు సంబంధించి ఎలాంటి సమస్య కనిపించినా వైద్యుడిని సంప్రదించటం అవసరం.












Click it and Unblock the Notifications