పాలకూర మంచిదే కానీ ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం డేంజర్!

సహజంగా ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆకుకూరలలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయని చెబుతారు. పాలకూర, తోటకూర, బచ్చలకూర, చుక్కకూర, గోంగూర ఇలా ప్రతి ఆకుకూరలలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పాలకూరను ఎక్కువగా తినకూడదు. మరి పాలకూరను ఎక్కువగా తినకూడని అనారోగ్య సమస్యలు ఏమిటి ప్రస్తుతం తెలుసుకుందాం.

పాలకూరలో ఫుల్ పోషకాలు
పాలకూరలో ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే పాలకూర ఎక్కువగా తింటే మూత్రపిండాలలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు జీర్ణ వ్యవస్థ సమస్యలు, ఫుడ్ ఎలర్జీలు కూడా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది.

spinach is good but it is dangerous for the sufferers with these health problems be careful

ఈ సమస్యలు ఉన్నవారు పాలకూర తినొద్దు
పాలకూరను యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా తినకూడదు. పాలకూరలో ప్యూరిన్ అనే మూలకం శరీరంలోని యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను బాగా పెంచుతుంది. దీని కారణంగా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు, యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు పాలకూరను మితంగా తినాలి. ఒక మాటలో చెప్పాలంటే వీరు పాలకూరని తినకుండా ఉండటమే మంచిది.

కిడ్నీలలో స్టోన్స్ ఉంటే పాలకూర తినొద్దు
కొంతమంది రక్తం పలుచబడడానికి మందులు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు కూడా పాలకూరను ఎక్కువగా తినకూడదు. పాలకూరలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం పలుచబడే మందులతో ప్రతిస్పందిస్తుంది. కాబట్టి ఇటువంటివారు పాలకూరను తినకూడదు. చాలామంది మూత్రపిండాలలో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. పాలకూరలో అక్సాలిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది కిడ్నీలలో స్టోన్స్ తయారవ్వడానికి దోహదం చేస్తుంది.

అలర్జీలు, జీర్ణ సమస్యలు ఉన్నా పాలకూరకు నో చెప్పాలి
కాబట్టి దీనిని మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు ఎక్కువగా తినకుండా ఉండడమే మంచిది. పాలకూరలో క్యాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే దీనిలో ఉండే ఆక్సలేట్ కాల్షియంతో బంధించబడి శరీరంలోని క్యాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అలర్జీలతో బాధపడేవారు పాలకూరని తినకుండా ఉండడమే మంచిది. ఇక జీర్ణ వ్యవస్థ సమస్యలతో బాధపడే వారు కూడా పాలకూరని తినే విషయంలో జాగ్రత్త వహించాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+