ఇట్టాంటి బంగాళాదుంపలను తింటే.. బతుకు బంగాళాఖాతమే
బంగాళాదుంపలు మన వంటగదిలో సర్వసాధారణంగా కనిపించేవే. వీటితో ఎన్నో వెరైటీ వంటకాలను వండుకోవచ్చు. కర్రీ మొదలుకుని ఫ్రై దాకా.. అలాగే- ఫ్రెంచ్ ఫ్రైస్ మొదలుకుని పొటాటో ట్విస్టర్ దాకా రుచికరంగా బంగాళాదుంపలను రోజువారీ ఆహార పదార్థాల్లో తీసుకుంటూ ఉంటాం. ఒక్కసారి అవి మొలకెత్తడం లేదా ఆకుపచ్చగా మారడం మొదలుపెడితే- వాటిని పక్కన పెట్టేయడానికి మించిన మంచిపని మరొకటి ఉండదు.
ఇలాంటి బంగాళాదుంపలో ఆరోగ్యానికి హానికరమైనవని డాక్టర్లు చెబుతున్నారు. బంగాళాదుంపలు మొలకెత్తడం లేదా ఆకుపచ్చ రంగులోకి మారడం అంటే- అవి తమను తాము కీటకాల నుండి రక్షించుకోవడానికి విషపూరిత సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తున్నాయని అర్థం. గ్లైకోఅల్కలాయిడ్స్ అని పిలువబడే సోలనైన్, చకోనైన్ వంటి ప్రధాన విష పదార్థాలు బంగాళాదుంపలు మొలకెత్తినప్పుడు ఉత్పత్తి అవుతుంటాయి. వీటిని తీసుకోవడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చు.

జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం- మొలకెత్తిన బంగాళాదుంపలలో సోలనైన్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఇది తీవ్రమైన విషపూరిత ప్రభావాలకు కారణమవుతుంది. వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, తలనొప్పి, మైకం, ఇంకా తీవ్రమైన సందర్భాల్లో మతిమరుపు లేదా పక్షవాతం వంటి నరాల సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు.
గ్లైకోఅల్కలాయిడ్స్ అనేవి బంగాళాదుంపలు స్వీయ రక్షణ కోసం ఉత్పత్తి చేసే సహజ విష పదార్థాలు. తాజా బంగాళాదుంపల్లో ఇవి తక్కువ మొత్తంలో ఉంటాయి. అవి మొలకెత్తినప్పుడు లేదా ఆకుపచ్చగా మారినప్పుడు వాటి స్థాయి పెరుగుతుంది. సోలనైన్, చకోనైన్ అధిక మొత్తంలో తీసుకున్నప్పుడు జీర్ణ సంబంధిత సమస్యలను, నరాల సంబంధిత లక్షణాలను కలిగిస్తాయి. ఆకుపచ్చగా మారిన లేదా మొలకెత్తిన బంగాళాదుంపలను తినకుండా ఉండటం మంచిది.
ఆకుపచ్చ రంగులో మారినప్పుడు క్లోరోఫిల్ అభివృద్ధి చెందుతుంది. మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు ప్రమాదకరం. మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు గ్లైకోఅల్కలాయిడ్స్ అధికంగా ఉన్న బంగాళాదుంపలను తీసుకోవడం వల్ల సోలనైన్ విషం బారిన పడవచ్చు. వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, తలనొప్పి, మైకం, గందరగోళం లేదా మతిమరుపును కలిగించడం దీని లక్షణం.
బంగాళాదుంపలను చల్లని, చీకటి, పొడి ప్రదేశంలో ఉంచండం వల్ల అవి మొలకెత్తకుండా చూడవచ్చు. వండడానికి ముందు ఏవైనా ఆకుపచ్చ భాగాలను లేదా మొలకలను తొలగించాలి. మెత్తగా, ముడతలు పడిన లేదా ఎక్కువగా మొలకెత్తిన బంగాళాదుంపలను పారవేయాలి. ఉడకబెట్టడం లేదా వేయించడం వలన విష పదార్థాలు కొద్దిగా తగ్గుతాయి గానీ అవి పూర్తిగా తొలగిపోవు.
Disclaimer: ఈ వ్యాసం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే, వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మొలకెత్తిన బంగాళాదుంపలను తీసుకున్న తర్వాత మీకు ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి.












Click it and Unblock the Notifications