వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
వర్షాకాలంలో నిరంతరం కురుస్తుండే వానల వల్ల చుట్టు పక్కల పరిసరాల్లో నీరు నిలుస్తుంది. ఈగలు, దోమలకి ఇవి నిలయంగా మారుతాయి. దీనివల్ల అంటువ్యాధులు సంభవిస్తాయి. జ్వరం రావడంతోపాటు వాంతులు కూడా అవుతుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యంగా ఉండటానికి కొన్నిరకాల ఆయుర్వేద పద్ధతులను పాటించడంద్వారా ఇన్ ఫెక్షన్ ను నివారించుకోవచ్చు.
సూక్ష్మజీవులను దూరంగా ఉంచడానికి, ఇన్‌ఫెక్షన్ నివారించడానికి ఔషధ స్నానం చేయాలి. ఇలా చేయడంవల్ల వాత దోషం తొలగిపోతుంది. డ్రై మసాజ్ కూడా తరుచుగా చేయించుకుంటుండాలి. శరీరంలో వాత దోషాన్నిఈ మస్తాజ్ సమతుల్యం చేయడంతోపాటు శరీర కణజాలాల నుంచి విషాన్ని తొలగిస్తుంది. పంచకర్మలోని ఐదు విధానాలలో ఔషధ బస్తీ ఒకటి. దీనినే ఎనిమా అంటారు. ప్రధానంగా అస్థాపన, అనువాసన రెండు రకాలుగా ఉంటుంది. వాతవ్యాధులన్నీ దీన్ని పాటించడంద్వారా తొలగిపోతాయి.

మనస్సును శాంతింప చేయడానికి, ఒత్తిడిని తట్టుకోవడానికి.. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. లోతైన శ్వాసకు సంబంధించిన వ్యాయామాలను ప్రాక్టీస్ చేస్తుండాలి. ఇలా చేయడంవల్ల భావోద్వేగాలు సమతుల్యమవుతాయి. శారీరకంగానే కాకుండా మానసికంగా మరింత ధృఢంగా తయారవుతారు. అయితే వర్షాకాలంలో ఆయుర్వేదం ప్రకారం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.. వాటిని తెలుసుకుందాం.
1. చెప్పులు లేకుండా బయట తిరగకూడదు. పాదాలను పొడిగా ఉంచుకోవాలి
2. వర్షంలో ఆటలాడటం మానుకోవాలి.
3. భారీ వ్యాయామాలు, పగటివేళ నిద్ర పోవడాన్ని మానుకోవాలి.
4. తరుచుగా మజ్జిగ తాగడం మంచిది కాదు












Click it and Unblock the Notifications