సడెన్ గా మద్యం మానేస్తున్నారా? అయితే మీరివి తప్పక తెలుసుకోవాలి!

చాలామంది మద్యం సేవిస్తారు. మద్యపానం చేయడం హానికరమని తెలిసినప్పటికీ అలవాటుని మానుకోలేని వారు చాలామంది ఉంటారు. అయితే విపరీతంగా మద్యం తాగే వాళ్ళు ఒక్కసారిగా మద్యం మానేస్తే కూడా ప్రమాదమేనని చెబుతున్నారు వైద్యులు. విపరీతంగా మద్యం తాగడం ఎంత డేంజర్ నో సడన్ గా మద్యపానం పూర్తిగా మానేయడం కూడా అంతే డేంజర్ అని హెచ్చరిస్తున్నారు.

మద్యపానం మానివేయడం వల్ల విత్ డ్రాయల్ సిండ్రోమ్
ఒక్కసారిగా మద్యం సేవించడం మానడం వల్ల మన శరీరం మీద తీవ్రమైన ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మద్యం తాగడాన్ని క్రమంగా కొద్దికొద్దిగా తగ్గించాలి కానీ ఒక్కసారిగా మానేస్తే చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇలా అకస్మాత్తుగా మద్యపానం మానివేయడం వల్ల విత్ డ్రాయల్ సిండ్రోమ్ సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు.

stop alcohol drinking suddenly But you must know the severe problems of this

మద్యం మానేస్తే సమస్యలివే
మద్యం మానేయడం వల్ల కొంతమందిలో టెన్షన్, అలసట వస్తాయని మానసిక సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాదు ఆల్కహాల్ ప్రేరేపిత బ్రాంతి కూడా కలుగుతుందని ఎవరో పిలిచినట్టు పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నట్టు భ్రమకు గురవుతారని చెబుతున్నారు.

సడన్ గా మద్యం మానేయడం వల్ల మానసిక, న్యూరో సమస్యలు
ఏళ్ల తరబడి మద్యం తాగి ఏదో ఒక కారణంతో తాగడం మానేస్తే వాళ్లలో వెంటనే మానసిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అయోమయానికి, గందరగోళానికి తీవ్ర ఆగ్రహానికి గురవుతారని చెబుతున్నారు. సడన్ గా మద్యం మానేయడం వల్ల న్యూరోలాజికల్ సమస్యలు కూడా వస్తాయని ఈ దశలో వారు అన్నింటినీ మర్చిపోతారని చెబుతున్నారు.

మద్యం సడెన్ గా మానేస్తే ఇబ్బంది ఇలా
మద్యం ఒక్కసారిగా మానేస్తే శరీరం కంట్రోల్ తప్పుతుందని, కండరాలు వీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మద్యం సడెన్ గా మానేసిన వారు నిద్రలేమి సమస్యను ఫేస్ చెయ్యాల్సి వస్తుందని, సైకలాజికల్ గా చాలా ఇబ్బందికి గురవుతారని అంటున్నారు. అందుకే ఆల్కహాల్ మానేయాలని గట్టిగా అనుకునేవారు క్రమ క్రమంగా తగ్గించుకుంటూ రావాలి తప్ప ఒకటేసారి మానేస్తే దాన్ని దుష్ప్రభావం శరీరం పైన తప్పకుండా ఉంటుందని అందుకే ఏదైనా అతిగా చేస్తే మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+