షుగర్ పేషెంట్స్ ఎంత సేపు నడవాలి - ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
మధుమేహం. ఒక్క సారి వచ్చిందంటే జీవితాంతం జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రస్తుత కాలంలో మధు మేహ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరగటానికి అనేక కారణాలు ఉన్నాయి. సక్రమమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు పాటిస్తే డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందు లో భాగంగా ముఖ్యంగా రోజూ వాకింగ్ చేస్తే డయాబెటిస్తో బాధపడుతున్న వారికి ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. అయితే, మధుమేహం ఉన్న వారు ఎంత సేపు నడవాలి ..
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని పైన నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.
రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచటం లో నడక సహకరిస్తుంది. డయాబెటిస్ బాధితులు రోజుకు కనీసం 30 నిమిషాలు నడిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వారంలో 5 రోజులు, రోజుకి 30 నిమిషాలు వాకింగ్ చేస్తే మేలని పరిశోధనలు వెల్లడించాయి. అదే విధంగా క్రమం తప్ పకుండా ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనం లో తేలింది. శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెరిగితే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. యోగా, ధ్యానం, వ్యాయామం లాంటివి చేయాలని సూచిస్తున్నారు. ఎవరికైనా శారీరక శ్రమ అవసరమని, అందుకోసం క్రమం తప్పకుండా వాకింగ్ చేయాలని చెబుతున్నారు. ఫలితంగా రక్తంలో షుగర్ స్థాయిలు అదుపులో వస్తాయని వివరిస్తున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ .. లంచ్.. డిన్నర్ తరువాత కనీసం పది నిమిషాలు నడిస్తే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయని వెల్లడిస్తున్నారు.

వాకింగ్ చేసేటప్పుడు గంటకు మూడు నుంచి నాలుగు మైళ్ల మితమైన వేగంతో నడిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరగడంతోపాటు గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి. అయితే, వాకింగ్ వేళ పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జాయింట్లపై ఒత్తిడి పడకుండా ఉండాలంటే సమాంతరంగా ఉన్న నేలపై నడక కొనసాగించాలని చెబుతున్నారు. ఆ తర్వాత మెట్లు ఎక్కడం, దిగడం చేయాలని తెలిపారు. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఉదయం లేదా సాయం త్రం వేళల్లో వాకింగ్‌కు ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి. వాకింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి చర్మానికి ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ముఖంలో నీరసం పోయి సహజ కాంతితో ఉండేలా చేస్తుందని వెల్లడిస్తున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications