అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

చాలామంది ఉన్నట్టుండి ఒక్కసారిగా బరువు పెరిగిపోతూ ఉంటారు. బరువు తగ్గడానికి .రకరకాల ప్రయత్నాలు చేస్తూ, నానా తిప్పలు పడుతున్నప్పటికీ బరువు తగ్గకపోగా, మరింత బరువు పెరగడం చాలామందిని ఆందోళనకు గురిచేస్తుంది. సన్నగా కావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఒత్తిడికి గురవుతున్న వారు కూడా ఆకస్మాత్తుగా బరువు పెరుగుతూ మరింత టెన్షన్ తెచ్చి పెట్టుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండి బరువు పెరగడానికి గల కారణాలు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

అకస్మాత్తుగా బరువు పెరగటానికి కారణాలివే
శరీరంలో హార్మోన్ల స్థాయిలలో వచ్చే మార్పుల కారణంగా మన శరీరంలో జీవక్రియల పనితీరు నెమ్మదించడం వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మన బరువును అమాంతం పెంచేస్తుంది. కొంతమంది రుతుక్రమం సమయంలో బరువు పెరుగుతారు. ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ హార్మోన్స్ స్థాయిలలో ఈ సమయంలో సంభవించే మార్పుల వలన బరువులో మార్పు వస్తుంది.

Suddenly gaining weight But know these reasons for sudden weight gain

ఈ మందులతోనూ బరువు పెరుగుతారు
కొంతమంది విపరీతమైన స్ట్రెస్ తో ఒత్తిడిని తగ్గించే మందులను వాడుతూ ఉంటారు. మరికొందరు గర్భనిరోధకమాత్రలను వాడుతూ ఉంటారు. వీటి వలన కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అనవసరంగా ఎక్కువ అనవసరమైన మందులను వాడడం మానుకోవాలి. అంతేకాదు కొంతమందిలో థైరాయిడ్ సమస్య వల్ల కూడా శరీరం బరువు విపరీతంగా పెరుగుతుంది. ఆరోగ్య వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే థైరాయిడ్ గ్రంధి పనితీరు సరిగా ఉండాలి.

ఈ కారణాలతోనూ బరువు పెరిగే ప్రమాదం
థైరాయిడ్ గ్రంధి పనితీరులో ఏమాత్రం హెచ్చుతగ్గులు వచ్చినా శారీరక బరువు విపరీతంగా పెరుగుతుంది. ఇక కొంతమంది కొన్నిసార్లు ఎలాంటి ఆకలి లేకపోయినా కంటికి కనిపించిన, మనసుకు నచ్చిన ప్రతి ఒకటి తినేస్తూ ఉంటారు. అవసరానికి మించి జంక్ ఫుడ్స్ తినే వారిలోనూ, స్ట్రీట్ ఫుడ్ తరచూ తినేవాళ్లలోనూ బరువు సమస్య వస్తుంది. కొందరు ఆహారం రుచిగా ఉండాలని ఆకర్షణీయంగా కనిపించాలని రకరకాల రంగులను కలుపుతుంటారు.

నిద్రలేమి సమస్యతోనూ బరువు పెరిగే ప్రమాదం
దీంతో కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. కొంతమంది సరిగ్గా నిద్రపోరు. నిద్రలేమి సమస్యతో చాలామంది మానసిక స్థితి దెబ్బతింటుంది. ఎక్కువ నిద్రపోని వారిలో దాని ప్రభావం ఆహారంపైన పడుతుంది. వారి ఆకలి ఊహించని విధంగా పెరుగుతుంది. దీంతో వారు అతిగా తినే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఇది బరువును బాగా పెంచుతుంది.

సడన్ గా బరువు పెరిగితే ఎందుకో గుర్తించటం ముఖ్యం
కాబట్టి నిద్రలేమి సమస్య కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చు. అయితే పైన పేర్కొన్న సమస్యలలో ఏ సమస్య మీ బరువు పెరగడానికి కారణం అవుతుందో గుర్తించి, వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఆరోగ్యంగా జీవించవచ్చు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+